
*ప్రపంచ వ్యాప్తంగా మరింతగా పోగుపడిన సంపన్నుల సంపద..*
ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచ వ్యాప్తంగా 2,640 మంది సంపన్నుల (గత సంవత్సరం ఈ సంఖ్య 2,668 గా ఉంది) 10 అంకెల ఆదాయాన్ని పరిగణన లోకి తీసుకుని ఒక పట్టికను తయారు చేసింది.
ఈ పట్టిక ప్రకారం ప్రపంచం లోని శత సహస్ర కోటీశ్వరుల సంపద 12.2 ట్రిల్లియన్ డాలర్లు (1 బిల్లియన్ అంటే 100 కోట్ల డాలర్లు. 1 బిల్లియన్ డాలర్లు 8300 కోట్ల రూపాయలకు సమానం. 1ట్రిల్లియన్ అంటే 1000 బిల్లియన్లు.. అంటే 1 ట్రిల్లియన్ 83 లక్షల కోట్ల రూపాయలకు సమానం)..
ఇది గత సంవత్సరం లోని 12.7 ట్రిల్లియన్ కంటే 500 బిల్లియన్ తక్కువ. ఈ పట్టిక లోని ఎలన్ మస్క్‌తో సహా సగం మంది ఆస్తులు తగ్గాయి. ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక తెస్లా షేర్ విలువ పడిపోవటంతో మొదటి స్థానం నుంచి రెండవ స్థానానికి దిగ జారాడు.
ఎలన్ మస్క్ స్థానాన్ని విలాస వస్తువులను తయారు చేసే ఎల్‌విఎమ్‌హెచ్ కంపెనీ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఆక్రమించి మొట్ట మొదటిసారిగా ప్రపంచంలో ఒక ఫ్రెంచ్ పౌరుడు అత్యంత సంపన్నుడుగా నిలిచాడు. (అయితే, ప్రస్తుతం ఈయన రెండవ అత్యంత సంపన్నుడు అవటానకి కారణం ఎలన్ మస్క్ తిరిగి పుంజు కోవటమే)..
అనూహ్యంగా నవంబర్‌లో ఎలన్ మస్క్‌కు చెందిన తెస్లా షేర్ విలువ 17 శాతం పెరిగి 28 బిల్లియన్ల సంపద చేరటంతో మస్క్ సంపద 245 బిల్లియన్లకు చేరింది. అలా ఆయన తిరిగి ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా నిలిచాడు.
శత సహస్ర కోటీశ్వరుల సంఖ్య అత్యధికంగా వున్న దేశాలలో 735 మందితో అమెరికా అగ్ర భాగాన ఉంది.
వీరి సమిష్టి సంపద విలువ 4.5 ట్రిల్లియన్ డాలర్లు. హాంగ్ కాంగ్, మకావుతో కలిపి చైనా 562 మందితో రెండవ స్థానాన్ని ఆక్రమించింది.
వీరి సమిష్టి సంపద విలువ 2 ట్రిల్లియన్ డాలర్లు. శత సహస్ర కోటీశ్వరుల సంఖ్యలో 169 మందితో భారత దేశం మూడవ స్థానాన్ని ఆక్రమించింది.
వీరి సమిష్టి సంపద 675 బిల్లియన్ డాలర్లు. జీవన వ్యయ సంక్షోభం కారణంగా కోట్లాది మందికి కనీస అవసరాలు కూడా తీరటం కష్టమైన స్థితిలో ప్రపంచ వ్యాప్తంగా సంపన్నుల సంపద గుట్టలుగా పోగుపడుతోంది.
2023 లో ప్రపంచం లోని 50 మంది అత్యంత సంపన్నులలో 12 మందిది తప్ప అందరి సంపదా పెరిగింది.
అత్యున్నత స్థాయి లోని 500 మంది సంపన్నులలో 77 శాతం మంది సంపద పెరిగింది. వీరిలో కొందరి సంపద ఊహాతీతంగా పెరిగింది.
అలెన్ మస్క్ సంపద 816 బిల్లియన్ డాలర్లకు పెరిగింది. ఇది అంగోలా స్థూల జాతీయోత్పత్తి కంటే ఎక్కువ. అందరికంటే ఫేస్ బుక్ స్థాపకుడైన మార్క్ జూకర్ బర్గ్ సంపంద 184 శాతం పెరిగింది.
45 బిల్లియన్లు ఉన్న ఆయన సంపద 128 బిల్లియన్ డాలర్లకు పెరిగింది. ఆయన స్థాపించిన మెటా (గతంలో ఫేస్ బుక్) కంపెనీ సంపద గత సంవత్సరం కంటే 172శాతం పెరిగింది.
జూకర్ బర్గ్ సంపద కంటే వేగంగా ఇండోనేషియా కార్పొరేట్ పెట్టుబడిదారు ప్రజోగో పన్జేస్తు సంపద 7రెట్లు పెరిగింది.
అత్యున్నత స్థాయి లోని 15 మందిలో 15వ అత్యంత సంపన్నుడిగావున్న గౌతమ్ అదానీ సంపద 35శాతం తగ్గి 53 బిల్లియన్లుగా ఉంది. తాజాగా అదానీ ర్యాంకు 23వ స్థానానికి పడిపోయింది.
భారత దేశంలో అత్యంత సంపన్నుడైన ముకేష్ అంబానీ మాత్రమే టాప్ 10 మంది అత్యున్నత స్థాయి సంపన్నుల జాబితాలో తన స్థానాన్ని నిలబెట్టు కున్నాడు.
82 బిల్లియన్ డాలర్ల సంపదతో అంబానీ ప్రపంచంలో 9వ అత్యున్నత సంపన్నుడిగా ఉన్నాడు..