Date: 09/07/26 | time: 7:22 Pm
గచ్చిబౌలి లో ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటివరకు తెలంగాణ లో స్పోర్ట్స్ కి ఒక పాలసీ లేదన్నారు. తమ ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ, పాలసీని రూపొందించామని రేవంత్ అన్నారు. మహాత్మగాంధీ 1921-1931 కాలంలో యంగ్ ఇండియా పత్రికని నడిపారని, ఆ స్పూర్తితోనే ఈ యునివర్సిటీకి యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ గా పేరు పెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ వర్సిటీ లోగో, వెబ్ సైట్ ఆవిష్కరించి, పారా అథ్లెట్స్ ప్రోగ్రాం పోస్టర్ ని ఆవిష్కరించారు.
140 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశం, క్రీడలలో మాత్రం బోసిపోతుందని రేవంత్ అన్నారు. 1999 నుంచి 2004 వరకు తెలంగాణ ఏషియన్ గేమ్స్, కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహించాం. కానీ తరువాత క్రీడల పరంగా ఎటువంటి ఈవెంట్లు గత ప్రభుత్వాలు పెట్టలేదన్నారు. ఈ యూనివర్సిటీని ప్రభుత్వం నడపదన్నారు. 2036 ఒలింపిక్స్ హైదరాబాద్ లో జరపాలని తమ ప్రభుత్వం పట్టుదలగా ఉందన్నారు. ప్రభుత్వ చట్టం ప్రకారం ఏర్పాటు చేసే బోర్డు ఆఫ్ గవర్నర్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. క్రీడా రంగ నిపుణులు పర్యవేక్షణలో ,రాజకీయ జోక్యం ఉండదని రేవంత్ అన్నారు. ప్రభుత్వం ప్రారంభంలో పిపిపి మోడల్ ద్వారా పరిశ్రమలు, క్రీడా సంస్థల సహకారం తీసుకుంటామని ప్రకటించారు. ముగింపులో రేవంత్ పలువురుకి నగదు రూపంలో చెక్కులను అందచేశారు. పి.టి. ఉష, క్రీడల మంత్రి శ్రీహరి తదితర క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
keywords: sports university telangana, gachibowli, telangana, congress, cm revanth reddy, తెలంగాణ, రేవంత్ రెడ్డి, స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి
AUTHOR: K. Ravi