Date: 09-07-26| Time: 07:28PM
ఎప్పుడూ రాజకీయాలలో బిజీగా గడిపే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తన మనవడితో కలిసి సరదాగా గడిపిన క్షణాలను ఎక్స్ అకౌంట్ వేదికగా వీడియో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా” అని మనవడు అడిగితే తప్పుతుందా? అని రాసుకొచ్చారు. అలాగే పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు.. బిజీ బిజీ సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, జ్ఞాపకాలు అని మనవడిపై ప్రేమను వీడియో రూపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
“తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా” అని మనవడు అడిగితే తప్పుతుందా?
పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు…
బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు..#Family pic.twitter.com/TXDbufWCdY
— Revanth Reddy (@revanth_anumula) July 9, 2026
Author: Sivanarayana