Date: 09-078-26 | time 03:54
ఈ వింత ఇంట్రెస్టింగ్ సంఘటన తెలంగాణలోని “యాదాద్రి భువనగిరి” జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కొండే రఘుపతి అనే వ్యక్తి చాలా రోజులుగా ఒక కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేసుకున్నాడు.
అనుకున్నదే తడవుగా చిట్యాలలోని ”శ్రీ వినాయక మోటార్స్” హీరో షోరూమ్ కు వెళ్లాడు. అక్కడ తనకు నచ్చిన హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే పేమెంట్ చేసే టైమ్ లో ఆయన నోట్ల కట్టలు తీయలేదు. దానికి బదులుగా సంచుల కొద్దీ కేవలం 10 రూపాయల నాణేలను షోరూమ్ సిబ్బంది ముందు పెట్టాడు.
గంటల తరబడి కాయిన్స్ లెక్కించిన షోరూమ్ స్టాఫ్
ఆ బైక్ మొత్తం ధర అక్షరాలా రూ. 1.10 లక్షలు. ఆ మొత్తాన్ని రఘుపతి కేవలం 10 రూపాయల కాయిన్స్ రూపంలోనే చెల్లించాడు. బస్తాల కొద్దీ ఉన్న వేలాది నాణేలను చూసి ఫస్ట్ షోరూమ్ వర్కర్స్ అవాక్కయ్యారు.
సాధారణంగా అంత చిల్లర చూస్తే ఎవరికైనా చిరాకు రావడం సహజం. కానీ, ఆ షోరూమ్ యాజమాన్యం వర్కర్స్ మాత్రం రఘుపతి పొదుపును, ఆయన నమ్మకాన్ని గౌరవించారు. వర్కర్స్ అంతా కలిసి కింద కూర్చుని, ఎంతో ఓపికగా గంటల తరబడి ఆ నాణేలన్నింటినీ లెక్కబెట్టారు. మొత్తం అమౌంట్ కరెక్ట్ గా సరిపోవడంతో, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసి రఘుపతికి సరికొత్త బైక్ కీస్ అందజేశారు.
సోషల్ మీడియాలో వైరల్.. నెటిజన్ల ప్రశంసలు
షోరూమ్ లో బస్తాల కొద్దీ నాణేలను కుమ్మరించి లెక్కిస్తున్న విజువల్స్, ఫోటోలను అక్కడ ఉన్న స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వార్త కాస్తా క్షణాల్లో వైరల్ గా మారింది. రఘుపతి డిసిప్లిన్ రూపాయి రూపాయి కూడబెట్టి, ఎంతో క్రమశిక్షణతో ఇన్నేళ్లు పొదుపు చేసి తన డ్రీమ్ బైక్ కొన్న రఘుపతిని నెటిజన్లు అభినందిస్తున్నారు. “దాచుకుంటే ప్రతి రూపాయి కూడా ఒక పెద్ద మొత్తంగా మారుతుందని” ఆయన నిరూపించారని కామెంట్లు పెడుతున్నారు.
ఎక్కడా విసుక్కోకుండా, చట్టబద్ధంగా చెల్లుబాటయ్యే కరెన్సీని (Legal Tender) గౌరవించి, ఓపికగా లెక్కబెట్టిన ‘శ్రీ వినాయక మోటార్స్’ షోరూమ్ యాజమాన్యాన్ని అంతా కొనియాడుతున్నారు.
ఇదోఒక ముఖ్యమైన సందేశం!
ఈ ఘటన నుంచి సమాజానికి ఒక మంచి సందేశం కూడా అందింది. ఆర్బీఐ జారీ చేసిన 10 రూపాయల నాణేలు దేశంలో పూర్తిగా చెల్లుబాటు అవుతాయి. వాటిని తీసుకోవడానికి నిరాకరించడం చట్టరీత్యా నేరం. ఇప్పటికైనా 10 రూపాయల కాయిన్స్ చెల్లవనే అపోహలను వీడాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
మీ అభిప్రాయం ఏంటి?
రూపాయి నోట్లతో కాకుండా, ఇలా కాయిన్స్ తో లక్ష రూపాయల బైక్ కొన్న రఘుపతి ఐడియా షోరూమ్ వాళ్ల ఓపికపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి!
AUthor: D. sravani