Date: 09/07/2026 | 11:47 Am
తాటిచెట్టు ఎక్కడం అంటే.. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఆకాశంతో యుద్ధం చేయడమే! ఒక్క అడుగు అటు ఇటైనా ప్రాణాలు గాల్లో కలవాల్సిందే! అందుకే… నేటి తరం ఈ వృత్తికి పూర్తిగా దూరమైపోతోంది. కానీ.. ఒకే ఒక్క ఆలోచన! తమిళనాడుకు చెందిన ఒక రైతు చేసిన ఆలోచన.. ఇప్పుడు యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది. తాటిచెట్టు ఎక్కడానికి ఏకంగా… ఇనుప మెట్లు కట్టేశాడు!
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సలైపూదూర్ గ్రామానికి చెందిన దినకరాజ్.. ఒక కొత్త ఇన్నోవేటివ్ కి శ్రీకారం చుట్టారు. ఈ రోజుల్లో తాటిచెట్లు ఎక్కే టాలెంట్ ఉన్న కూలీలు దొరకడం గగనమైపోయింది. సాంప్రదాయ పద్ధతిలో చెట్టు ఎక్కడం ఎంత రిస్కో అందరికీ తెలిసిందే. కూలీలు లేక చెట్లు వృథాగా మారిపోతుంటే.. దినకరాజ్ ఊరికే కూర్చోలేదు. తానే రంగంలోకి దిగారు. టెక్నాలజీని, కామన్ సెన్స్ ని జోడించి.. చెట్టు చుట్టూ ఇనుప మెట్లను డిజైన్ చేశారు!
FILE SOURCE:
View this post on Instagram
ఈ ఏర్పాటు కోసం ఆయన ఖర్చు చేసింది అక్షరాలా.. 60 వేల రూపాయలు! ‘60 వేలు ఒక చెట్టుకా?’ అని కొందరు నవ్వుకోవచ్చు. కానీ ఇక్కడే ఉంది అసలైన బిజినెస్ మైండ్! ఈ ఇనుప మెట్లు కనీసం 14 సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉంటాయట. పైగా, ఈ మెట్ల నుంచి ఏ వయసు వారైనా.. ఎంతో ఈజీ, సెఫ్ గా చెట్టు పైకి వెళ్లి నీరా తియోవచ్చు. ఈ ఐడియా వల్ల ఒకే ఒక్క ఏడాదిలో లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తోందని దినకరాజ్ గర్వంగా చెబుతున్నారు.
ALSO READ: Colours swathi: పెళ్లి కంటే కుక్కను పెంచుకోవడం మంచిదన్న స్వాతి..
సమస్యలు అందరికీ వస్తాయి.. కానీ ఆ సమస్యలోనే సరికొత్త అవకాశాన్ని వెతుక్కునేవాడే నిజమైన లీడర్! కూలీలు లేరని బాధపడకుండా, తాటిచెట్టునే ఒక ‘కల్పవృక్షం’లా మార్చేసిన దినకరాజ్ ఆలోచన నిజంగా అభినందనీయం. త్వరలోనే తన పొలంలోని అన్ని చెట్లకు ఇలాంటి మెట్లే ఏర్పాటు చేయబోతున్నారు. మరి.. రిస్క్ ని తగ్గించి, లాభాలను పెంచిన ఈ తమిళనాడు రైతు ఐడియాపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
Keywords: Dinakaran viral innovation palm tree steps, Dinakaran palm tree steps, palm tree steps, VIRAL VIDEO, TELUGU LATEST NEWS, దినకర్ రాజ్, తమిళనాడు, సలైపూదూర్ గ్రామం, దినకర్ రాజ్ తటికల్లు వైరల్ వీడియో, తెలుగు న్యూస్, వైరల్ న్యూస్
AUTHOR: Durgam shravani