09/07/26 | 7:05 pm
కొండలు, కోనలు, రీమోట్ ఏరియాలలో మొబైల్ నెట్వర్క్ అసాధ్యం. మరి అలాంటి చోట్ల ఉన్నవారు మొబైల్ యూజ్ చేయడం ఎలా? ఇలాంటి వారి కోసమే బీఎస్ఎన్ఎల్ సరికొత్తగా శాటిలైట్ ఫోన్ తీసుకొచ్చింది. ఈ ఫోన్‌తో సిగ్నల్ ఇబ్బందులు లేకుండా, నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ అంటోంది. మనం సాధారణంగా ఉపయోగించే ఫోన్లు టవర్లు, సిగ్నల్ ఆధారంగా పనిచేస్తాయి. కానీ ఈ శాటిలైట్ ఫోన్ నేరుగా అంతరిక్షంలోని శాటిలైట్లతో అనుసంధానమై ఉంటుంది.
also read: Thopudurti prakashreddy arrest: అనంతపురంలో హైటెన్షన్
గ్లోబల్ శాటిలైట్ నెట్ వర్క్ ప్రొవైడర్ ఇన్మార్సాట్ (ఐఎన్ఎమ్ఏఆర్ఎస్ఏటీ) తో బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. దీని ధర అన్ని పన్నులతో కలుపుకొని 1,34,166 రూపాయలుగా నిర్ణయించారు. కవరేజ్ లేని ప్రాంతాల్లో, అత్యవసర పరిస్థితుల్లో వాయిస్ కాల్స్ చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.
keywords: bsnl, bsnl network, phone signals, remmote areas, బిఎస్ఎన్ఎల్, ఫోన్ సిగ్నల్, ఏజెన్సీ ఏరియా
author: ramesh