date: 09/07/2026 |6:35 pm
అనంతపురం రాజకీయాల్లో రగడ ఇప్పుడే చల్లారే పరిస్థితి కనపడటం లేదు. ఇటీవలే జేసీ దివాకర్, కేతిరెడ్డి పెద్దిరెడ్డిల సవాళ్లు, అరెస్టులతో అట్టుడికిన అనంతపురంలో నేటికి అదే పరిస్థితి కొనసాగుతోంది. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సవాళ్లతో మళ్లీ అనంత లో హీట్ పెరిగింది. ఈ క్రమంలో అనంతపురం లో ప్రకాశ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఎమ్మెస్ రాజు సవాల్
నారా లోకేష్, పరిటాల శ్రీరామ్, సునీత లపై తోపుదుర్తి చేసిన కామెంట్స్ నిరూపించాలని, లేదంటే చెప్పు తీసుకుని కొడతానని ఎమ్మెస్ రాజు సవాల్ విసిరారు. గురువారం సాయంత్రం దీనికి డెడ్ లైన్ పెట్టారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం గంటకో నాటకీయ పరిణామాలు జరిగాయి. పోలీసులు భారీగా ఇరువురి ఇంటిదగ్గర మోహరించారు.
file source: instagram
View this post on Instagram
తోపుదుర్తి ఇంటిలో బీరు బాటిళ్లు
ఉదయం నుంచే పోలీసులు ఇరువురి ఇళ్ల దగ్గర భారీగా మోహరించారు. ఈ క్రమంలో తోపుదుర్తి ఉంటున్న నాలుగు ఫ్లోర్ల ఇంటిలో తనిఖీలు చేశారు. ప్రతి ఫ్లోర్లో బస్తాలలో రాళ్లు, కాలీ బీరు బాటిళ్లు గుర్తించారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
also read: Pawn Kalyan: ‘ నిరంజన్ మృతి పై ఎమోషనల్ ట్వీట్ ’
తోపుదుర్తి ఇంటిని కొనుగోలు చేసిన ఎమ్మెస్
ఈ ఇద్దరి మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సందర్భంలోనే ఎమ్మెస్ రాజు తోపుదుర్తి ఉంటున్న అద్దె ఇంటిని కొన్నారు. ఇది వైసీపీ కార్యకర్తకు చెందిన ఇళ్లు కాగా ఏడేళ్ల నుంచి ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
అసలు కామెంట్స్ ఏంటి?
‘‘మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గెలిచిన మూడు నెలల్లోనే 7 కోట్లతో ఇల్లు కొన్నారు. బెంగళూరులో కూడా ఇల్లు కొన్నారు. రాజు చెప్పులు షాపులో పని చేసి స్ధాయి నుంచి నారా లోకేష్ కి బీనామీగా మారారు’’ అని తోపుదుర్తి మొన్నామధ్య ప్రెస్ మీట్ లో అన్నారు. అక్కడి నుంచి ఈ వివాదం మొదలైంది.
key words: తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ఎమ్మెస్ రాజు, వైసీపీ, టీడీపీ, అనంతపురంలొో ఉద్రిక్తత topudurti prakash reddy, ms raju, tdp, ycp high tension at ananthapuram
author: vasu