తన వీరాభిమాని నిరంజన్ మృతి పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎమోషనల్ అయ్యారు. ఎక్స్ వేదికగా పోస్టు చిసిన ఆయన.. “నిరంజన్ ఇక లేడనే వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది” అని అన్నారు.కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ను కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నా అతడి ముఖంలో కనిపించిన చిరునవ్వు ఎప్పటికీ మర్చిపోలేనిదని చెప్పారు. అతడి ధైర్యం, ఆత్మవిశ్వాసం తనను ఎంతో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు.
https://publish.x.com/?url=https://twitter.com/PawanKalyan/status/2069729120267993312#
నిరంజన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పవన్.. ఈ బాధను తట్టుకునే శక్తిని ఆ కుటుంబానికి భగవంతుడు ఇవ్వాలని ప్రార్థించారు. చివరగా “ప్రియమైన నిరంజన్.. నీ చిరునవ్వు, నీ ధైర్యం ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ స్మరించుకున్నారు.
author: B. swathi