Date: 10/07/26| Time: 02:00PM
డబ్బున్న సిటీ అనగానే మనకు గుర్తొచ్చే మాయానగరి ముంబై, సిలికాన్ వ్యాలీ బెంగళూరుల హవాకు గట్టి బ్రేకులు పడ్డాయి. ఇండియాలోనే అత్యంత ధనిక జిల్లాగా మన పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లా నంబర్ వన్ సింహాసనాన్ని ఎక్కేసింది. తాజా ఎకనామిక్ సర్వే లెక్కల ప్రకారం.. ఈ జిల్లాలో ఒక్కో వ్యక్తి సగటు వార్షిక ఆదాయం ఎంతో తెలుసా? అక్షరాలా 11.46 లక్షలు! అవును, మీరు విన్నది నిజమే. దేశంలో మరే జిల్లా కూడా ఈ రేంజ్లో సంపాదనను నమోదు చేయలేదు.

ఢిల్లీ పరిసరాల్లోని గురుగ్రామ్, నోయిడా, ఐటీ క్యాపిటల్ బెంగళూరు, చెన్నై లాంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి రంగారెడ్డి ఈ ఘనత సాధించడం దేశవ్యాప్తంగా ఒక పెద్ద సంచలనంగా మారింది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో కొలువై ఉన్న గ్లోబల్ ఐటీ కంపెనీలు, ఏషియాలోనే టాప్ బయోటెక్ హబ్ అయిన ‘జీనోమ్ వ్యాలీ’.. వీటికి తోడు ఆకాశాన్ని తాకుతున్న ఇక్కడి రియల్ ఎస్టేట్ బూమ్ ఈ జిల్లాను కుబేరుల అడ్డాగా మార్చేశాయి. ఫార్మా, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో వస్తున్న భారీ పెట్టుబడులు కూడా ఇక్కడి ప్రజల ఆదాయాన్ని అమాంతం పెంచేసాయి.

ఒకప్పుడు హైదరాబాద్కు కేవలం శివారు ప్రాంతంగా ఉన్న రంగారెడ్డి, ఇప్పుడు దేశ ఆర్థిక సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. ఇక్కడి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ లైఫ్ స్టైల్ చూసి గ్లోబల్ ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు. కేవలం ఒకే ఒక్క ప్రాంతం దేశ ఆర్థిక పటంలోనే ఇంతటి భారీ మార్పు తీసుకురావడం నిజంగా గర్వకారణం. నేషనల్ లెవల్లో రంగారెడ్డి సృష్టించిన ఈ ఆల్టైమ్ రికార్డ్ చూసి ఇప్పుడు దేశమంతా నోరెళ్లబెడుతోంది.
Key words : Rangareddy richest district in india, Highest per capita income districts india, Rangareddy average annual income 11.46 lakhs, Hyderabad it corridor economic survey, రంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా ఆదాయం, ఇండియాస్ రిచెస్ట్ డిస్ట్రిక్ రంగారెడ్డి, గచ్చిబౌళి ఐటీ రియల్ ఎస్టేట్ రికార్డ్, హైదరాబాద్
Author: B. Venu