Harishrao comments on cm: తెలంగాణ రైతులను అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉరి వేసినా తప్పులేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మేడిగడ్డ బ్యారెజ్ పై మాట్లాడారు. నదుల్లో నీళ్లు పుష్కలంగా ప్రవహిస్తున్నా, నీళ్లుండి మోటార్లు నడపకుండా నిర్లక్ష్యంగా ఉండటం సీఎం రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ చేస్తున్న నేరమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. నీటిపారుదల మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఇద్దరూ విఫలమయ్యారని హరీష్ రావు విమర్శించారు. దేవాదుల దగ్గర మోటర్లను ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు.

ఇక్కడ నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ అభ్యంతరాలు లేవని సీఎంని అడిగారు. చంద్రబాబుకు గురుదక్షిణగా తెలంగాణ వాడుకోవాల్సిన నీళ్లను సీఎం రేవంత్ ఆంధ్రాకు వదులుతున్నాడని మండిపడ్డారు. కట్టిన ఇళ్ళు, పెట్టిన పొయ్యి లాగా కేసీఆర్ అన్నీ చేసారని, కానీ కాంగ్రెస్ ఏమీ చేయట్లేదని విమర్శించారు. అబద్ధాలాడే విషయంలో సీఎం రేవంత్ కి నోబుల్ ప్రైజ్ వస్తుందని అన్నారు. సీఎం నిన్న చెప్పిన ప్రతి ఒక్కొక్క అబద్ధానికి ఒక్కొక్క అక్షరానికి సమాధానం చెబుతానని సవాల్ విసిరారు.
https://twitter.com/HarishRaoOffice/status/2074792444714238374
రాజీనామా చేస్తా
తమ్మిడి హట్టి వద్ద 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకున్నట్టు ఆధారాలు ఉంటే బయట పెట్టాలని సీఎం రేవంత్ ను హరీష్ సవాల్ చేశారు. ఆధారాలు చూపిస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారు. లేదంటే బయటకు వచ్చి తప్పైంది అని తెలంగాణ ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలని అన్నారు.
రేవంత్ నీకు కేసీఆర్ అవసరం లేదని నేను చాలని హరీష్ రావు అన్నారు. ఒక్క మూడు నెలలు నాకు ఇరిగేషన్ శాఖ అప్పగిస్తే నీళ్ళు ఎలా తేవాలో నేను చూపిస్తానని సవాల్ విసిరారు.
ALSO READ: Pawn Kalyan: ‘ నిరంజన్ మృతి పై ఎమోషనల్ ట్వీట్ ’
AUTHOR: korsa kalyan