సూర్యపేట జిల్లా కాంగ్రెస్ పార్గీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రోడ్డు ఎక్కాయి. తుంగతుర్తి నియోజికవర్గంలో ఇటీవల ప్రకటించిన తొమ్మిది మండలాల కాంగ్రెస్ కమీటీల నియామకం పార్టీలో తీవ్ర చిచ్చు రేపింది. ఈ కొత్త కమీటీలను వెంటనే మార్చాలంటూ ఎమ్మెల్యే అసంతృప్తి వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు బుధవారం ఉదయం హైదరాబాద్ లోని ఛలో గాంధీభవన్ కు భారీ కాన్వయ్ తో బయలుదేరారు.
అయితే, వీరి వాహనలు అర్వపల్లి చౌరస్తకు చేరుకోగానే స్థానిక ఎమ్మెల్యే అనుచరులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరుపక్షాలు పంతాలకు పోయి కర్రలు, రాళ్లతో ఒకరిని ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో రెండు కార్ల అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ ఘటనతో స్థానిక వ్యాపారులు, ప్రజలు తీవ్ర భయానికి గురై పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న పోలిసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొదట ఇరువర్గాలను సమర్ధించేందుకు ప్రయత్నించిన, వాళ్లు వినకుండా మళ్లీ దాడులకు దిగారు. దీంతో పరిస్థితి చేయి జరకుండా ఉండేందుకు పోలిసులు ఇరువర్గాలపై లాఠీచార్జ్ చేశారు. ప్రస్తుతం అర్వపల్లిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, ఘర్షణకు కారణమైన ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలపై పోలిసులు కేసులు నమోదు చేసి దర్యప్తు జరుపుతున్నారు.
Author: Bandi Venu