Kondagattu Prasadam shortage: శనివారం కొండగట్టు అంజన్న సన్నిధికి భక్తుల తాకిడి పెరగడం వల్ల.. ప్రసాద పంపిణీలో కొంత అంతరాయం ఏర్పడింది. దీంతో భక్తులకు.. ఆలయ అధికారులకు చిన్న ఘర్షణ వాతావరణం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో భక్తులు తీవ్ర నిరసనకు దిగారి.. గంటల తరబడి క్యూ లైన్ లో నిలిచి ఉన్నప్పటికీ.. చివరకు ప్రసాదం అందుబాటులో లేకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భక్తులు ప్రసాద విక్రయ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత లడ్డును కొనడం సాధారణమే.. కానీ భక్తుల ప్రతి విపరీతంగా పెరగడం కారణంగా కొంత ప్రసాద కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది.
శనివారం కావడంతో స్వామివారి దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి.. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచారు. దర్శనం ముగించుకొని లడ్డు ప్రసాదం కోసం కౌంటర్ల వద్ద వేచి ఉన్న భక్తులకు ఊహించని నిరాశ ఎదురయింది.. గంటలకు ఉంది క్యూలో నిలబడిన తర్వాత.. కౌంటర్ వద్ద సిబ్బంది లడ్డూలు లేవు అని చెప్పడంతో భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. వేల రూపాయల ఆదాయం వచ్చే ఆలయంలో కనీసం ప్రసాదం నిల్వలు ఉంచకపోవడంపై భక్తులు ఆలయ సిబ్బందిపై మండిపడుతున్నారు..
ప్రసాదం ఎప్పుడు వస్తుందని ప్రశ్నించిన భక్తులపై ఆలయ సిబ్బంది కాస్త పార్టీ పట్టనట్లు ప్రవర్తించడంతో చిన్న గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. సమాధానం చెప్పిన సిబ్బంది నిర్లక్ష్యంగా మాట్లాడటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి ఎంతో భక్తితో వస్తే.. ప్రసాదం అడిగినందుకు మమ్మల్ని అవమానిస్తారా? అంటూ భక్తులు నిలదీసినట్లు సమాచారం. ఈ క్రమంలో భక్తులకు సిబ్బందికి మధ్య చిన్న వాగ్వాదం కూడా జరిగినట్లు తెలుస్తోంది.
కౌంటర్ల వద్ద ఎవరు సరైన సమాధానం భక్తులకు అందించకపోవడంతో.. ఒక భక్తుడు నేరుగా ప్రసాదం తయారీ కేంద్రం దగ్గరకు వెళ్లి నిరసనకు దిగినట్లు కూడా సమాచారం. అక్కడ సిబ్బందిని నిలదీస్తూ.. ప్రసాద పంపిణీలో జరుగుతున్న జాప్యంపై కూడా ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అతనికి మద్దతుగా ఇతర భక్తులు కూడా తోడవడంతో అక్కడ కాసేపు చిన్న ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు కూడా తెలుస్తోంది. సాధారణంగా రద్దీ ఉన్న రోజుల్లో ముందస్తుగా ప్రసాదాలను సిద్ధం చేయాల్సి ఉన్న.. ఆలయ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని భక్తులు విమర్శిస్తున్నారు. భక్తుల రద్దీని అంచనా వేయడంలో యంత్రాంగం పూర్తిగా వైఫల్యమైందని ఆరోపిస్తున్నారు..