Ralph Lauren Skrit Troll: ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ రాల్ఫ్ లారెన్ (Ralph Lauren) మరోసారి వివాదంలో చిక్కుకుంది. భారతీయ సాంప్రదాయ కళ అయిన ‘బంధాని’ (Bandhani) డిజైన్‌ను కాపీ కొట్టి దానికి సరైన గుర్తింపు ఇవ్వకుండా భారీ ధరకు విక్రయిస్తోందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తుతున్నాయి.
అసలు విషయం ఏంటి?
రాల్ఫ్ లారెన్ తన తాజా సమ్మర్ 2026 కలెక్షన్లో ఒక కాటన్ స్కర్ట్‌ను పరిచయం చేసింది. బ్లూ, ఎల్లో, రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ స్కర్ట్ మన దేశంలోని గ్రామీణ ప్రాంత మహిళలు కట్టుకునే సాధారణ బంధాని స్కర్టులనే పోలి ఉంది. అయితే దీని ధర వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఈ స్కర్ట్ ధర అక్షరాలా 375 డాలర్లు (సుమారు రూ. 31,000). ఈ వివాదంపై నెటిజన్లు, ఫ్యాషన్ డిజైనర్లు ప్రధానంగా మూడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు:
గుర్తింపు లేకపోవడం: ఈ స్కర్ట్ డిజైన్ ‘బంతాని’ టెక్నిక్ నుంచి ప్రేరణ పొందిందని కంపెనీ చెప్పనిటికి అది భారతదేశానికి చెందిన కళ అని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. దీనిని “సాంస్కృతిక దోపిడీ” (Cultural Appropriation) గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.
నాణ్యత, ధర: ఇది నిజమైన బంధాని (చేత్తో చేసిన అద్దకం) కాదని కేవలం మిషన్ ప్రింట్ అని విమర్శకులు చెబుతున్నారు. భారత్‌లో ఒక మీటరు అసలైన బంధాని వస్త్రం ధర కేవలం రూ. 200 నుంచి రూ. 500 వరకు మాత్రమే ఉంటుంది. అలాంటిది ఒక సాధారణ ప్రింటెడ్ స్కర్ట్‌ను రూ. 31 వేలకు అమ్మడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కళాకారులకు అన్యాయం: భారతీయ గొప్ప కళా సంపదను వాడుకుంటూ దాని మూలాలను గౌరవించకపోవడంపై ప్రముఖ భారతీయ డిజైనర్లు పెదవి విరుస్తున్నారు.
ముగింపు:
అంతర్జాతీయ బ్రాండ్లు భారతీయ కళల నుంచి స్ఫూర్తి పొందడం మంచిదే అయినా ఆ కళకు పురిటిగడ్డ అయిన దేశానికి ఆ వృత్తిని నమ్ముకున్న కళాకారులకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేవలం లాభాల కోసం ఒక సంస్కృతిని వాడుకోవడం సరైంది కాదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.