![]() |
||
|
ప్రధాని అయ్యాక మోదీ చేసిన విదేశీ పర్యటనల వివరాలు |
pm modi foreign visits list: నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆర్థిక అసమానతలు దేశాన్ని పట్టి పీడిస్తుంటే, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం హాయిగా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఒకటి, రెండు సార్లు కాదు.. మోదీ ప్రధాని అయ్యాక దాదాపు 81 దేశాలలో 100కు పైగా పర్యటనలు చేశారు. ప్రధాని గా భూటాన్ తో మొదలైన మోదీ విదేశీ పర్యటన ప్రస్తుతం ఇండోనేషియా, ఆస్ట్రేలియా పర్యటనల్లో బిజీగా నడుస్తోంది. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి గా కాకుండా గ్లోబల్ టూరిస్టుగా మారిపోయాడంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కోవిడ్ సమయంలో కూడా పీఎం విదేశీ పర్యటనలు చేయడం పై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. పాలన కంటే పర్యటనలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడంటూ దేశ వ్యాప్తంగా సాధారణ ప్రజలు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి, దేశంలో పెట్టుబడుల కోసం ప్రధాని విదేశీ పర్యటనలు అవసరమని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మోదీ అంబాసిడర్ గా చేస్తున్న కొన్ని విదేశీ పర్యటనల్లో ఆయన ధరించే దుస్తులు, ఫోటో షూట్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
https://publish.x.com/?url=https://twitter.com/PMOIndia/status/2074121120287248790#
ప్రధాని పర్యటనలు దేశం కోసం కాకుండా, ఎక్కువగా పెట్టుబడిదారులకు అనుకూలంగా జరుగుతుంటాయి. ఆయన చేసే ప్రతి విదేశీ పర్యటన మన దేశ వ్యాపారా దిగ్గజాలకు ఏదో రకంగా లాభాలను ఇస్తున్నాయి. విదేశీ ప్రాజెక్టులు నేరుగా అదాని, అంబానీలకే దక్కుతున్నాయని, ఇది క్రోనీ క్యాపిటలిజం అని కొంతమంది సామాజికవేత్తల అభిప్రాయం. విదేశాల్లో పోర్టులు, టెర్మనల్ ల నిర్మాణాలు, గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్ లాంటి ప్రాజెక్టుల సంస్థలలో ఎక్కువగా అదాని గ్రూప్ భాగస్వామ్యం ఉంటుంది.

రక్షణ రంగంలో ఇజ్రాయెల్, ఫ్రాన్స్ దేశాల పర్యటనల సమయంలో కుదిరిన ఒప్పందాలతో అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్, అదానీ ఏరో డిఫెన్స్ సంస్థలు విదేశీ రక్షణ కంపెనీలతో (రఫెల్, ఎల్బిట్ సిస్టమ్స్) కలిసి పని చేయడానికి ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. పొరుగు దేశాలపై (నేపాల్, శ్రీలంక) భారత ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి మరీ అదానీ గ్రూప్ కు ప్రాజెక్టులు ఇప్పిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. మోదీ పర్యటనలు కేవలం సొంత డబ్బా కొట్టుకోవడానికి కార్పొరేట్ ఈవెంట్ లాగా మారుతున్నాయని రాజకీయ విమర్శకుల అభిప్రాయం.
PM @narendramodi arrived in Jakarta, Indonesia. He was warmly received by President @prabowo.
During the visit, PM Modi will hold talks with President Subianto, visit the Prambanan Temple complex at Yogyakarta, as well as interact with the Indian community. pic.twitter.com/gstC4YxfI9
— PMO India (@PMOIndia) July 6, 2026
దేశ సమస్యలను గాలికొదిలేసి, నిరంతరం విమానాల్లో తిరిగే మోదీ దేశ ప్రధానిలా వ్యవహరిస్తున్నారా లేక అంతర్జాతీయ పర్యాటకుడిలా కాలక్షేపం చేస్తున్నారా అనేది ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న.
నెహ్రూ ఆదర్శం-మోదీ ప్రచారం
నెహ్రూ అంతర్జాతీయ వేదికలపై ‘అలీన విధానం’, ‘ప్రపంచ శాంతి’ అంటూ నైతిక విలువలతో కూడిన చర్చలు నడిపారు. రష్యా, జర్మనీ, బ్రిటన్ సహకారంతో భీలాయ్, రూర్కెల, దుర్గాపూర్ వంటి భారీ ఉక్కు కర్మాగారాలు, ఐఐటీల స్థాపనకు కృషి చేసారు.
కానీ మోదీ పర్యటనలు అంతా వ్యాపారం, ప్రచారంగా మారింది. ‘మేక్ ఇన్ ఇండియా’ పేరుతో వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు తెస్తున్నామని కార్పొరేట్ ఈవెంట్లలో ప్రచారం చేసుకుంటున్నా, క్షేత్రస్థాయిలో రూపాయి విలువ పతనం కావడం, ద్రవ్యోల్బణం పెరగడం మారలేదు.
ఫ్రాన్స్ నుండి రాఫెల్ యుద్ధ విమానాలు, అమెరికా తో జెట్ ఒప్పందాలు చేసుకున్నా.. అవి దేశ సార్వభౌమత్వాన్ని పెంచటం కన్నా విదేశీ కంపెనీల లాభాలకే ఎక్కువ సహాయ పడ్డాయనే ఆరోపణలు ఉన్నాయి.
ALSO READ: ఒలంపిక్స్ లో ఫుట్ బాల్ ఆడిన క్రీడాకారులున్న హైదరాబాద్, ఇప్పుడు లయ కోల్పోయి
AUTHOR: Ramesh
