
ఆంధ్రప్రదేశ్ తిరుమల నడకదారిలో రెండు రోజుల క్రితం చిన్నారి లక్షితను చంపిన చిరుత చిక్కింది. చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు పలు చోట్ల బోన్లను ఏర్పాటు చేశారు. అలిపిరి కాలినడక మార్గన ఏడోమైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుతను అధికారులు గుర్తించారు. చిన్నారిపై దాడి చేసిన ప్రాంతానికి సమీపంలోనే చిరుత చిక్కింది. పులి బోనులో చిక్కుకోవడంతో కాలినడకన వచ్చే భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ రోజు సోమవారం ఉదయం తిరుమలలో మరో చిరుత సంచారం కలకలం రేపింది. నడకదారిలో ఈ ఉదయం కొందరు భక్తులు వెళ్తుండగా చిరుత కనిపించింది. దీంతో వారు అక్కడ నుంచి పరుగులు తీశారు. భక్తుల అరుపులతో చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. దీంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉదయమే ఒక చిరుత చిక్కిందని భక్తులు, టీటీడీ ఊపిరి పీల్చుకోగా.. తాజాగా మరో చిరుత సంచారం కలవరపెడుతోంది.