అప్పుడెప్పుడో చిరంజీవి కోటి రూపాయల రెమ్యూనిరేషన్ తీసుకున్నాడని తెగ ఆశ్చర్యపోయాం! వామ్మో… అంతనా అని బిత్తరపోయాం! అలా కోటితో మొదలైన పారితోషికం ఇప్పుడు కోటానుకోట్లకు చేరుకుంది. సినిమాకు అయిన బడ్జెట్లో సగానికి సగం హీరోకే చెల్లించుకోవాల్సి వస్తుంది. పది పదిహేనేళ్ల కిందట అత్యధిక పారితోషికం తీసుకునే హీరో రజనీకాంత్ అని చెప్పుకునేవారు. సినిమాకు తాము ఇంత తీసుకుంటున్నామని ఆర్టిస్టులు ఏనాడూ చెప్పుకోలేదు కానీ మీడియాలో ఫిగర్లు వచ్చేవి. రీసెంట్గా తమిళ హీరో విజయ్ రెమ్యూనిరేషన్పై బోలెడన్ని వార్తలు వస్తున్నాయి.
సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకున్న విజయ్ నటించిన చివరి సినిమా జననాయగన్. ఇలాగని విజయే ప్రకటించుకున్నాడు. ఈ సినిమా కోసం విజయ్‌కు పెద్ద మొత్తంలో పారితోషికాన్ని ముట్టచెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇండియాలో ఎవరూ తీసుకోనంత అత్యధిక రెమ్యూనిరేషన్ను విజయ్ పొందాడట! ఇంచుమించు 220 కోట్ల రూపాయలు నిర్మాతలు ఇచ్చారట! బాలీవుడ్ హీరోలు షారూక్, సల్మాన్‌ఖాన్‌లు కూడా ఇంత పారితోషికాన్ని తీసుకోలేదు. జననాయగన్ సినిమాకు అయిన ఖర్చు 380 కోట్ల రూపాయలు అయితే 220 కోట్లను విజయ్‌కే ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ మధ్యన వచ్చిన గోట్ సినిమాకు విజయ్ రెండు వందల కోట్ల రూపాయలు తీసుకున్నాడని వినికిడి. అంతకు ముందు లియో, వారసుడు సినిమాలకు 120 కోట్ల రూపాయలు వసూలు చేశాడట! అంటే విజయ్ రెమ్యూనిరేషన్ ఇప్పుడు డబుల్ అయ్యిందన్నమాట! అన్నట్టు ఈ సినిమాలో నటించిన హీరోయిన్‌కు ఎంత ఇచ్చారనుకుంటున్నారు..? జస్ట్ మూడు కోట్ల రూపాయలు మాత్రమే! విలన్‌కు కూడా అంతే ఇచ్చేసి సర్దుకోమన్నారు. నిన్నమొన్నటి వరకు అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా షారూక్‌కు పేరుండేది. ఇప్పుడు ఆ ప్లేస్‌ను విజయ్ ఆక్రమించాడు. సందీప్ రెడ్డి వంగా తీస్తున్న స్పిరిట్ సినిమా కోసం హీరో ప్రభాస్ దాదాపు 200 కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఫిల్మ్ నగర్ టాక్!