
వెనెజుయేలా ప్రెసిడెంట్ నికోలస్ మదురో అరెస్ట్ కు ముందు.. పెంటగాన్ నుంచి దానికి దగ్గర్లోనే ఉన్న పిజ్జాటో పిజ్జా కు వందల్లో ఆర్డర్లు వెళ్లాయి. అలా ఆర్డర్లు వస్తున్నాయంటే పెంటగాన్ ఏదో క్రూషియల్ టాస్క్ లో ఉందని అర్థం. ఒసామా బిన్ లాడెన్ మీద దాడి అప్పుడూ పిజ్జాటో పిజ్జా కు ఇలాగే వందల్లో పిజ్జా ఆర్డర్లు వెళ్లాయి. దీన్ని పెంటగాన్ పిజ్జా థియరీ అంటున్నారు. ఇలాగే స్టాక్ మార్కెట్ పెర్ఫార్మెన్స్ కి సంబంధించీ కొన్ని ఇంట్రెస్టింగ్ థియరీస్ ఉన్నాయి.
అవేంటంటే..
హెమ్ లైన్ ( మోకాళ్ల మీదికి ఉండే స్కర్ట్) ఇండెక్స్ ..
స్కర్ట్ లెంగ్త్ ను బట్టి స్టాక్ మార్కెట్ రెయిజ్ అండ్ ఫాల్ ను తెలుసుకోవచ్చని మార్కెట్ ఎక్స్ పర్ట్స్ అంటారు. దీని ప్రకారం.. అమ్మాయిలు మినీ స్కర్ట్స్ వేసుకుంటే స్టాక్ మార్కెట్ పెరిగి.. ఎకానమీ మంచి ప్రొగ్రెస్ లో ఉన్నట్టు. ఎక్కువ శాతం అమ్మాయిలు ఫ్లోర్ లెంగ్త్ స్కర్ట్స్ లో కనపడుతుంటే స్టాక్ మార్కెట్ పడిపోయి.. ఎకానమీ డల్ గా ఉన్నట్టు. ఉదాహరణగా.. 1920లు, 1960లను చూపిస్తారు మార్కెట్ ఎక్స్ పర్ట్స్. ఎందుకంటే.. షార్ట్ స్కర్ట్స్ వేసుకున్న అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపిస్తారు. షాపింగ్ కూడా విపరీతంగా పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరగడమన్నది ఆర్థిక వృద్ధి సూచికలో ప్రధానం కదా అంటారు మార్కెట్ నిపుణులు. లాంగ్ స్కర్ట్స్ ట్రెండ్, ఫ్యాషన్ రోజుల్లో స్టాక్ మార్కెట్ పడిపోవడం గమనించారు నిపుణులు. అంతేకాదు పెద్దగా షాపింగ్ లేకుండా మార్కెట్ అంతా డల్ గా ఉండటాన్నీ అబ్జర్వ్ చేశారు. అందుకే స్టాక్ మార్కెట్ రెయిజ్ అండ్ ఫాల్ ని స్కర్ట్ లెంగ్త్ ఆధారంగా తెలుసుకోవచ్చనే అభిప్రాయానాకి వచ్చారు. ‘ ద హెమ్ లైన్ ఇండెక్స్ ’ అనే ఈ థియరీని ప్రముఖ ఎకనమిస్ట్ జార్జ్ టేలర్ స్థిరపరచారని చెబుతారు.

కానీ..
ఎకనమిస్ట్ జార్జ్ టేలర్ రాసిన థీసిస్ లో .. యుద్ధానంతరం హౌజరీ ఇండస్ట్రీ గురించి చెబుతూ వెలిగి మినీ స్కర్ట్ ఫ్యాషన్ ను వివరించారు. 1920ల్లో హౌజరీ ఇండస్ట్రీ గ్రోత్ కు అదొక కారణమని చెప్పాడు తప్ప దాన్ని హెమ్ లైన్ ఇండెక్స్ గా ఎక్కడా పేర్కొనలేదు. అయితే..ఈ థియరీ అన్ని వేళలా కరెక్ట్ రిజల్ట్స్ ను ఇవ్వలేదు. కొన్నిసార్లు అంటే 1960. 70ల్లో మిక్స్డ్ రిజల్స్ట్ ను చూపించింది. అందుకే ఆధునిక ఫ్యాషన్ అనేది ఒక్క ఎకానమీతో నే ప్రభావితం కాదని ఎన్నో కంప్లెక్స్ ఫ్యాక్టర్స్ తో ఇన్ ఫ్లుయెన్స్ అవుతుందని అంటున్నారు ఆర్థికవేత్తలు.
ఇప్పుడైతే..ఫాస్ట్ ఫ్యాషన్ , సోషల్ మీడియా, వ్యక్తిగత అవసరాలు, హోదా, గుర్తింపు.. లాంటివెన్నో స్టాక్ మార్కెట్ ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి.

ఇంకో థియరీ.. లిప్ స్టిక్ ఇండెక్స్..
దీన్ని కాయిన్ చేసింది ఎస్టీ లాడర్ చైర్మన్ లియోనార్డ్ లాడర్. ఈ థియరీ ప్రకారం.. మార్కెట్ డల్ గా ఉన్నప్పుడు లిప్ స్టిక్స్ ఎక్కువగా అమ్ముడుపోతాయి. 2001, 2008 రెసిషన్ టైమ్ లో.. లిప్ స్టిక్స్ సేల్సే కనిపించాయి. పెద్ద పెద్ద లగ్జరీ బ్రాండ్స్ కి చెందిన కార్లు, డైమండ్స్ లాంటివి కొనగలిగి, హాలిడేస్ కి ప్రపంచ యాత్ర చేయగలిగిన రిచ్ పీపుల్ కూడా లిప్ స్టిక్స్ లాంటివే మాత్రమే కొంటూ తమ షాపింగ్ అర్జ్ తీర్చుకున్నారు. అయితే ఇది కూడా అంత అక్యురేట్ థియరీ కాదంటున్నారు ఆర్థికవేత్తలు. కోవిడ్ పాండమిక్ ఈ అంచనాను తలకిందులు చేసిందని చెబుతున్నారు. కోవిడ్ లో మాస్క్ లు.. లిప్ స్టిక్ మీద నుంచి ఫోకస్ ను నెయిల్ పాలిష్, మస్కారాకు మళ్లించాయని లెక్కలు చూపిస్తున్నారు.