సోషల్ మీడియా పిచ్చి మామూలుగా లేదు. ఓవర్నైట్ పాపులర్ కావడం కోసం యూత్ చిత్రవిచిఆ్రాలన్నీ చేస్తున్నది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నది. ఇట్టాగే గడ్డకట్టిన మంచులో రీల్స్ చేయడానికి ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుందో మహిళ. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మంచు ప్రాంతాలకు వెళ్లినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చలిని తట్టుకునే ఇన్సులేట్ బట్టలు వేసుకోవాలి. అప్పుడప్పుడు ఆక్సిజన్ స్థాయిలు కూడా పడిపోతాయి. ఇవన్నీ తెలుసుకోకుండా ఇద్దరు మహిళలు డాన్సులు చేస్తున్నారు. ఇందులో ఒకరు తెగ ఇబ్బంది పడ్డారు. ఆక్సిజన్ సరిగ్గా అందుక తల తిరిగింది. ఏడుస్తూ కుప్పకూలింది. వెంటనే అక్కడున్న వారు రియాక్టయ్యి హెల్ప్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే ఆమె ప్రాణాలు పోయేవి.