
సర్వే సత్యనారాయణ చిట్ చాట్
కేసీఆర్ పాలన గురించి ప్రజలకు తెలియంది కాదు
కరెక్ట్ వేదికల మీద మాట్లాడుదాం
పదేండ్లు ప్రజలు ఓపిక పట్టారు
తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ అభాసుపాలయ్యారు
కాంగ్రెస్‌కి ఈసారి ప్రజలు అధికారం ఇస్తారు
ఆయన వస్తే లబ్ధి కలుగుతుందని చాలా పార్టీల నేతలు నా దగ్గరికి వచ్చారు. బీజేపీ నేతలూ వచ్చారు.. ఒట్టిగనే ఉన్నవ్ కదా రా అన్నరు..
కానీ నాకు ఇద్దరు తల్లులు. ఒకటి నన్ను కన్న తల్లి, నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన సోనియా గాంధీ.. మల్కాజిగిరి ఎంపీ స్థానం కేటాయించారు.. జనరల్ సీట్ ఇచ్చారు
నేను సోనియా గాంధీని విడిచిపెట్టేది లేదు..
ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయి.. ఎమ్మెల్యేగా పోటీ చెయ్యి అన్నరు.. అందుకే అప్లికేషన్ ఇచ్చిన
నేనంటే గిట్టని వాళ్లు నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు..
నాకు ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలని లేదు.. అందుకే ఇన్నాళ్లూ కొంచెం స్తబ్దుగా ఉన్నా..
నా రాజకీయం మొదలైంది కంటోన్మెంట్‌లోనే.. 1985లో అక్కడి నుంచే పోటీ చేశాను. ఇప్పుడు అక్కడ అభ్యర్థి కూడా లేరు
మేం ప్రభుత్వంలోకి వస్తం..
అధికారంలో ఉన్న పార్టీ మంచి చేసినా.. ఇంకంబెంసీ ఉంటది..
అయినా కేసీఆర్ ఏం చేసిండు.. ఇప్పుడెందుకు..మైక్ పట్టుకుంటే నా తడాఖా ఏందో చూపిస్తా.. నియోజకవర్గంలో తిరుగుత..
2014-15లో కడియం శ్రీహరికి రాష్ట్ర ప్రభుత్వంలో చోటు రావడంతో వరంగల్ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది
వరంగల్ ఎంపీ సీటు వివేక్ కి ఇస్తమంటే నేను వద్దని సోనియాకు చెప్పాను.. వివేక్, ఆయన అన్నతో కూడా మాట్లాడిన.. రాజయ్యకే టికెట్ ఇవ్వాలని చెప్పిన..
ఉత్తమ్, కుంతియాలను తీసేసేంతవరకు గాంధీభవన్‌కు రానన్న..