
నడిరోడ్డుపై ఆదివాసీ మహిళ ప్రసవం…
అంబులెన్సు కు కాల్ చేస్తే డీజిల్ లేదని ఆలస్యం…
పురిటి నొప్పులతో 3 గంటలపాటు విల విల లాడిన నిండు గర్భిణీ…
అంబులెన్స్ ఆలస్యమవడం తో 3 గంటలపాటు పురిటి నొప్పులతో ఇబ్బంది పడ్డ ఆదివాసీ మహిళ చివరికి నడిరోడ్డుపై మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలం తులసిపేటలో చోటు చేసుకుంది…
తులసిపేటకు చెందిన కోరుకంటి లావణ్య నిండు గర్భిణి.గురువారం రాత్రి నొప్పులు మొదలవడంతో
కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని పీహెచ్
సీ పరిధిలో ఉండే అంబులెన్స్ కొరకు ఫోన్ చేయగా,
గ్రామం దాకా వచ్చేందుకు సరిపడా డీజిల్ లేదని
సదరు అంబులెన్స్ డ్రైవర్ చెప్పాడు.
దాదాపు 3 గంటల పురిటి నొప్పులతో లావణ్య విలవిల్లాడింది.
కుటుంబ సభ్యులు అతి కష్టం మీద రోడ్డుపైనే
ప్రసవం చేశారు. తర్వాత ఖానాపూర్ కు చెందిన
108 రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.