
ఆటో, లారీ డీ, స్పాట్లోనే ఇద్దరు యువకులు మృతి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలోని మద్దుకూరు గ్రామ వేంకటేశ్వరస్వామి టెంపుల్ సమీపంలో గుట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . ఈ రోజు ఉదయం కొత్తగూడెం వైపు వస్తున్న కట్టెల లోడ్ తో ఉన్న లారీని వి.ఎం బంజర్ వైపు వెళ్తున్న ఆటో ఎదురుగా వెళ్లి ఢీకొట్టింది. దీనితో లారీ ముందు భాగంలోకి ఆటో చొచ్చుకొని వెళ్లగా ఆటో లో ఉన్న జూలూరుపాడు కు చెందిన SK దర్గా అలీ(23సం), వట్టికొండ గోపి(22సం) అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో పూర్తిగా లారీ వైపు వెళ్లి బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రంగా జరిగింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అన్నపురెడ్డి పల్లి, చండ్రుగొండ పోలీసులు రోడ్డు పైన ఉన్న ఆటోలోని మృతదేహాలు తీసి ఆటోను రోడ్డు పక్కకు జరిపారు. లారి లోపలికి ఆటో చొచ్చుకొని వెళ్లడం కారణంగా మృతదేహాలు బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. వర్షం కారణంగా ప్రమాదం చోటుచేసుకుందా అని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.మృతులు దర్గా అలీ ఆటోడ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గోపి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు వాళ్ల బాబాయ్, పిన్ని వల్ల ఇంట్లో ఉంటు,ఫంక్షన్లకు డెకరేషన్ పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు.