
మెట్రో రైలు మూడవ దశ కారిడార్ ల సవివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికల (DPR) తయారీకి కన్సల్టెన్సీ సంస్థల ఎంపికకై పిలిచిన టెండర్లలో 5 కన్సల్టెన్సీ సంస్థలు తమ బిడ్లను సమర్పించాయని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ యండి శ్రీ ఎన్వీయస్ రెడ్డి ప్రకటించారు. ఈ 5 సంస్థలలో ఆర్వీ అసోసియేట్స్, సిస్ట్రా, యు.ఎం.టి.సీ, మరియు రైట్స్ అనే 4 సంస్థలు సాంకేతిక అర్హతను సాధించాయి. వాటి ఆర్థిక బిడ్లను ఆగస్టు 30వ తేదిన మెట్రో రైల్ భవన్లో తెరవడం జరిగింది.
ఆర్వీ అసోసియేట్స్ సాంకేతికంగా అత్యంత అధిక మార్కులను పొందడమే కాకుండా మొత్తం 4 ప్యాకేజీలలోను కూడా అన్నిటికన్నా అతి తక్కువ ఆర్ధిక బిడ్లను సమర్పించిందని శ్రీ ఎన్వీయస్ రెడ్డి తెలిపారు. టెండర్ నిబంధనల ప్రకారం ఆర్వీ అసోసియేట్స్ కి రెండు ప్యాకేజీలను ఇవ్వటం జరిగిందని; మిగిలిన రెండు ప్యాకేజీలను సాంకేతిక పరంగా రెండవ స్థానంలో ఉన్న సిస్ట్రా సంస్థ అతి తక్కువ ఆర్థిక బిడ్ తో సమానంగా తగ్గించగా, ఆ సంస్థకు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.
4 ప్యాకేజీలను ఈ రెండు సంస్థలకు ఇచ్చిన తీరు క్రింది విధంగా ఉంది:
ప్యాకేజినెం. | కారిడార్లు | ఎంపిక చేయబడిందిఏజెన్సీ | ధర |
I | BHEL – ఇస్నాపూర్ (13 కి.మీ.)ఎల్.బి. నగర్ – పెద్ద అంబర్పేట్ (13 కి.మీ)ORR పటాన్చెరువు జంక్షన్ – ORR నార్సింగి జంక్షన్ (22 km) ; మొత్తం: 48 కి.మీ | సిస్ట్రా | రూ.2.55 కోట్లు |
II | శంషాబాద్ జంక్షన్ మెట్రో స్టేషన్ – షాద్నగర్ (28 కి.మీ)శంషాబాద్ విమానాశ్రయం స్టేషన్ – కందుకూరు ఫార్మా సిటీ (26 కి.మీ)ORR శంషాబాద్ జంక్షన్ – ORR పెద్ద అంబర్పేట్ జంక్షన్ (40 km); మొత్తం: 94 కిమీ | ఆర్వీ | రూ.3.05 కోట్లు |
III | ఉప్పల్ ఎక్స్ రోడ్ – బీబీనగర్ (25 కి.మీ)తార్నాక X రోడ్ – ECIL X రోడ్ (8 కి.మీ.)ORR పెద్ద అంబర్పేట్ జంక్షన్ – ORR మేడ్చల్ జంక్షన్ (45 km); మొత్తం: 78 కి.మీ | ఆర్వీ | రూ.2.53 కోట్లు |
IV | JBS మెట్రో రైలు స్టేషన్ నుండి తూంకుంట వరకు (17 కి.మీ) డబుల్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ / మెట్రోడబుల్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్/మెట్రో ప్యారడైజ్ ఎక్స్ రోడ్ నుండి కండ్లకోయ వరకు (12 కి.మీ)ORR మేడ్చల్ జంక్షన్ – ORR పటాన్ చెరువు జంక్షన్ (29 km); మొత్తం: 58 కి.మీ | సిస్ట్రా | రూ.2.56 కోట్లు |
ఈ రెండు కన్సల్టెన్సీ సంస్థలు వచ్చే రెండు నెలల్లో ట్రాఫిక్ సర్వేలు, రవాణా రద్దీ అంచనాలు, ట్రాఫిక్ అంచనాలు, పలు రకాల రవాణా వ్యవస్థల విశ్లేషణ వంటి వివిధ అధ్యయనాలు పూర్తిచేసి ప్రిలిమినరీ ప్రాజెక్ట్ నివేదిక (PPR)లను సమర్పించాలి. ఆ తరువాత మూడు నెలల్లో మెట్రో రైలు అలైన్మెంట్, వయాడక్ట్/భూమి ఉపరితల మార్గం/భూగర్భ మార్గం వంటి ఆప్షన్లు, స్టేషన్లు మరియు డిపోలు, రైల్వే విద్యుత్ ఏర్పాట్లు, సిగ్నలింగ్ మరియు రైల్వే సమాచార వ్యవస్థ, రైలు బోగీలు, పర్యావరణం మరియు సామాజిక ప్రభావం, ఆదాయ వ్యయ అంచనా, ఛార్జీల పట్టిక , ప్రాజెక్టు అమలు విధానం వంటి విషయాలపై సవివరణాత్మక ప్రాజెక్టు నివేదికలను (DPR)లను సమర్పించవల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశానుసారం ఈ కన్సల్టెన్సీ సంస్థలను వివిధ కారిడార్ లలో సత్వరమే సర్వే పనులను ప్రారంభించాలని నిర్దేశించినట్లుగా యండి తెలియజేసారు.
-0-