
ఒకే వేదికపై అన్ని పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు
హనుమకొండ జిల్లా ముల్కనూర్ లో ఘటన భీమదేవరపల్లి, వెలుగు: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనడానికి ముల్కనూరు వాసవి ఇండస్ట్రీస్ వేదికయ్యింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూర్‌లో కొమురవెళ్ళి చంద్రశేఖర్ గుప్తా ఆధ్వర్యంలో 80 లక్షలతో నిర్మించిన వాసవి ఇండస్ట్రీ రీ ఒపెనింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ నుండి జడ్పి చైర్మెన్ డా.సుధీర్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి పోన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌రెడ్డి, సిసిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, బిజెపి రాష్ర్ట నాయకులు జెన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. వారందరికీ చంద్ర శేఖర్ గుప్త కామన్ ఫ్రెండ్. కాగా హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్దులందరు ఒకే వేదికపై కలుసుకోవడం, కలివిడిగా ఒకరితో మరొకరు సందడిగా గడపడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాజకీయాలను స్పోర్టివ్ గా తీసుకోవడం అంటే ఇదేననే చర్చ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలు వేరు వ్యాపారాలు వేరని, పార్టీలు వేరైనా స్నేహితులుగా కలిసే ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.