
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి పెరగడంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు యొక్క 3 గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు 7.603 టీఎంసీలు కాగా
ప్రస్తుత నీటి మట్టం 696.200 అడుగులు 6.647 టీఎంసీలుగా ఉంది ప్రాజెక్టు లోకి ఇన్ ఫ్లో గా 39716 క్యూసెక్కులుగా రావడంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్ట్ యొక్క 3 గేట్లను ఎత్తి 39716 క్యూసెక్కుల నీటిని గోదావరి లోకి విడుదల చేస్తున్నారు