
హోంగార్డు రవీందర్ ఆత్మహత్యయత్నం పై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్రా ధ్యక్షుడు శ్రీ జి.కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి
గత 17 ఏండ్లుగా హోంగార్డ్ గా పనిచేస్తున్న రవీందర్ (35) ఆత్మహత్యాయత్నం ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి
రవీందర్ ఆత్మహత్యాయత్నం ఘటనకు ముఖ్యమంత్రి కేసీఆరే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాను
అసెంబ్లీ సాక్షిగా 2017లో స్వయంగా సీఎం కేసీఆర్ హోంగార్డ్స్ ను పర్మినెంట్ చేస్తా అని మాట ఇచ్చి తప్పారు.
వాళ్ల గోడు చెప్పుకుందాం అంటే ఆయన దొరకరు. గత 2 నెలలుగా మంత్రుల ఇండ్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడం, జీతం సరిగా రాకపోవడం పైగా అవమానాలు, చీత్కారాలతో విసిగిపోతున్న హోంగార్డులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.
16 వేల మంది హోంగార్డ్స్ కు కేవలం రూ.27వేల జీతం ఇస్తున్నారు. ఏదైనా కారణంతో ఒక్క రోజు విధులకు హాజరు కాకపోతే తొమ్మిది వందల రూపాయలు కట్ చేస్తున్నారు. అంటే హోంగార్డులను రోజూవారీ కూలీలుగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
సంవత్సరానికి వందరోజుల అలవెన్స్ కింద 20 వేలు, యూనిఫాం అలవెన్స్ కూడా ఇస్తా అని ఇవ్వడం లేదు. 40 ఏండ్లు పని చేసిన వారికి సైతం రిటైర్మెంట్ అయితే శాలువా కప్పి బోకే ఇచ్చి పంపిస్తున్నారు.
కానీ హోంగార్డులు డిమాండ్ చేస్తున్నట్లుగా రూ.10లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వడం లేదు. ఉన్నన్ని రోజులు వారి సేవలను వినియోగించుకుని ఆ తర్వాత రోడ్డున వదిలేసేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
విధి నిర్వహణలో చనిపోతే ప్రమాదబీమా, కారుణ్య నియామకాలు చేపట్టాలన్న హోంగాంర్డుల డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు ఇవ్వాలని వారు చేస్తున్న న్యాయమైన డిమాండ్ లు నెరవేర్చాలని, అసెంబ్లీ సాక్షిగా మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ను బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది.
గతంలో తాను హోంగార్డుల సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేయడం, వారి హక్కుల కోసం పోరాడిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఎన్ని సమస్యలున్నా ఆత్మహత్య పరిష్కారం కాదని, హోంగార్డులు అధైర్య పడొద్దని కిషన్ రెడ్డి అన్నారు. హోంగార్డ్స్ కి బీజేపీ మద్దతు ఉంటుందని భరోసా ఇస్తున్నాను.