
Timings of Lunar Eclips : ఈ ఏడాది ఏర్పడే పూర్తి చంద్ర గ్రహణాల్లో ఇది రెండవది. ఇదే చివరిది కూడా. సెప్టెంబర్ 7, 8 తేదీల్లో ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణానికి ముందు మార్చి 14వ తేదీన వచ్చింది. అయితే ఈ సారి ఏర్పడే గ్రహణం ప్రపంచవ్యాప్తంగా 85 మంది ప్రజలకు కనిపిస్తుంది. గతంలోని గ్రహణం భారత్‌లో కనిపించలేదు. కానీ ఈ సారి ఏర్పడే సంపూర్ణ గ్రహణాన్ని చూసే వీలుంది. ఆసియా, యూరప్‌లతో పాటు అంటార్కిటికా, పశ్చిమ పసిఫిక్ మహా సముద్రం, ఆస్ట్రలాసినా, హిందూ మహాసముద్రం, తూర్పు అంట్లాంటిక్ మహా సముద్రాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది.
భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తేదీన రాత్రి 8.57కి మొదలై 8వ తేదీ ఉదయం 2.26కి ముగుస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాత్రి 9.57 నుంచి ఉదయం 1.27 వరకు ప్రజలకు ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. కాగా పూర్తి గ్రహణ స్థితి రాత్రి 11 నుంచి 12.23 వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు వివరించారు. ఋ సమయంలో చంద్రడు ఎరుపు లేదా నారింజ రంగులో కనిపిస్తాడు. ఈ గ్రహణాన్ని ప్రత్యేకమైన పరికరాలు ఏవీ లేకుండా సాధారణ కంటితోనే చూడవచ్చునని చెబుతున్నారు.
ఆలయాల మూసివేత

సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం మహా నివేదన అనంతరం 1 గంటకు ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, గ్రహణ శాంతి, హోమ పూజలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుండి భక్తుల దర్శనాలకు అనుమతి ఉంటుందని చెప్పారు.
వేములవాడ రాజన్న ఆలయాన్ని ఉదయం 11.25 గంటలకు మూసివేసి గ్రహణ మోక్షం.. సోమవారం ఉదయం తెల్లవారు జామున ఉదయం 3.45 గంటలకు తెరువనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
శ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలను మధ్యాహ్నం 1 గంట నుండి రేపు ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఆర్జిత, పరోక్షసేవలు, శ్రీస్వామివారి అమ్మవార్ల కల్యాణోత్సవం నిలిపివేస్తారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి భక్తుల దర్శనాలు ఉంటాయని వెల్లడించారు.