
Seat share of diffent parties in parliament: ఉప రాష్ట్రపతి పదవికి రేపు (సెప్టెంబర్ 9) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 781 సభ్యులు ఓటింగ్‌లు పాల్గొననున్నారు. అయితే ఏ పార్టీ అయిన ఓటింగ్‌లో పాల్గొనకపోతే సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే ఉభయ సభల్లో (లోకసభ, రాజ్యసభ) మొత్తం 788 మంది సభ్యులుంటారు. ప్రస్తుతం ఆ సంఖ్య 781గా ఉంది. లోకసభలో 542 మంది, రాజ్యసభలో 239 మంది సభ్యులున్నారు. వీటిరిలో ఎన్డీఏ కూటమి పక్షాన 425 సభ్యుల బలం ఉంది. ఇండీ కూటమికి 311 మంది సభ్యుల బలం ఉంది.
ఇతర ప్రతిపక్షాలకు 45 మంది సభ్యులున్నారు. వీరిలో ఏడుగురు సభ్యులున్న బీజేడీ మద్దతు కోసం ప్రధాని మోడీ ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క సభ్యుని బలం ఉన్న ఎంఐఎం ఇండీ కూటమికి మద్దతు పలికింది. నలుగురు రాజ్యసభ సభ్యులున్న బీఆర్ఎస్ ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. శిరోమణి అకాలీ దళ్తోపాటు మరికొన్ని ఏక సభ్య పార్టీలు, స్వతంత్రులు ఎటు వైపు మొగ్గుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది.