
ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశం
పదాధికారుల సమావేశంలో రూపొందించిన కార్యాచరణ
బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి, వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా రానున్న ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జ్ సమావేశంలో చర్చ
బీజేపీ కార్యాచరణ
సెప్టెంబర్ 11, 12:
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల సమావేశాలు.
సెప్టెంబర్ 13, 14:
నిరుద్యోగ సమస్యపై ఇంపార్క్ వద్ద 24 గంటల నిరసన దీక్ష (సెప్టెంబర్ 13న ఉ॥ 11.00 నుండి సెప్టెంబర్ 14 ఉ॥ 11.00 గం॥ వరకు)
సెప్టెంబర్ 15
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కిషన్ రెడ్డి, నాయకుల బృందం బైక్ ర్యాలీ (సికింద్రాబాద్ క్లాక్ టవర్ – ఓయూ – భైరాన్‌పల్లి – ఖిలాషాపూర్ – పరకాల వరకు)
సెప్టెంబర్ 15, 16:
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, విమోచన పోరాటాన్ని పాఠ్యం పుస్తకాలలో చేర్చాలని, పోరాట యోధులు మరణించిన ప్రదేశాలను స్మృతి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో బైక్ ర్యాలీల నిర్వహణ.
సెప్టెంబర్ 17
(ఉదయం 7.30) అన్ని పోలింగ్ బూత్‌లలోను, పార్టీ కార్యాలపై జాతీయజెండా ఎగురవేయాలి.
సెప్టెంబర్ 17
ఉ॥ 9.00 గం||లకు పరేడ్ గ్రౌండ్లో అధికారికంగా జాతీయ పతాక ఆవిష్కరణ- బహిరంగ సభ.
సెప్టెంబర్ 17
విశ్వకర్మ జయంతి సందర్భంగా 18 వృత్తుల వారికి లబ్ధి చేకూర్చే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. హైదరాబాద్, వరంగల్‌లో కేంద్ర మంత్రులు పాల్గొంటారు
సెప్టెంబర్ 17
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలి. (మోదీ ఫోటో, కమలం గుర్తు మాత్రమే ఉండాలి)
సెప్టెంబర్ 20 – 22
450 మంది నాయకులు- 3 రోజులలో ఏదైనా రెండు రోజులలో 2 మండలాల సందర్శన
సెప్టెంబర్ 24
‘మేరా మాటి- మేరా దేశ్’ కార్యక్రమాన్ని ఇప్పటి వరకుజరగని అన్ని పోలింగ్ బూత్‌లో నిర్వహించాలి.
సెప్టెంబర్ 25
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాలు
సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 13 వరకు:
3 బస్ యాత్రలు
కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహాన్ని, మోసాలను ప్రజలకు వివరిస్తూ బస్ యాత్ర
సెప్టెంబర్ మాసంలో:
ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ అసెంబ్లీ నియోజకవర్గాలలో సమ్మేళనాలు నిర్వహించాలి.
సెప్టెంబర్- అక్టోబర్:
జిల్లాల వారీగా తెలంగాణ అభివృద్ధిలో మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలు
సేవాపక్షం పేరుతో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ పుట్టిన రోజు వేడుకల నిర్వహిన
గత తొమ్మిదేళ్లలో నరేంద్ర మోదీ గారి సుపరిపాలన, చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రచార కార్యక్రమాలు.
ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ప్రకటించిన రూ. 13, 500 కోట్లతో చేపట్టిన విశ్వకర్మ పథకం ఆవిష్కరణ
మేరా మాటీ – మేరా దేశ్ కు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ . ఈ నెలాఖరు వరకు ఈ కార్యక్రమం కొనసాగించాలని నిర్ణయం