
సెప్టెంబర్ 17నాడు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాలను పురస్కరించుకుని.. కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి మీడియాతోమాట్లాడారు
వారి ప్రసంగం ముఖ్యాంశాలు
నిజాం అరాచక పాలన నుంచి నాటి హైదరాబాద్ సంస్థానం విమోచన సందర్భంగా సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగరేంది.చరిత్రలో ప్రతీ ప్రత్యేక ఘట్టానికి ఉత్సాహంగా, పండగగా, వేడుకగా జరుపుకుంటాం.. కానీ తెలంగాణలో గత 75 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాలను అధికారికంగా జరపకపోవడం దురదృష్టకరం.బీజేపీ గత 25 ఏళ్లుగా అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలను నిర్వహించాలంటూ పోరాటం చేస్తుంది.కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, నేటి బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఆసక్తి చూపడం లేదు.కానీ బీజేపీ ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. గతేడాది సెప్టెంబర్ 17న ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా ‘తెలంగాణ విమోచన ఉత్సవాలను’ నిర్వహించాం.75 ఏళ్ల క్రితం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు త్రివర్ణ పతాకం ఎగరేస్తే.. 75 ఏళ్ల తర్వాత అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా గారి చేతుల మీదుగా గతేడాది హైదరాబాద్ లో ఉత్సవాలు జరిగాయి.తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి బీఆర్ఎస్ పార్టీ.. చీము నెత్తురుంటే తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాలని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.కేసీఆర్ అధికారం చేపట్టిన ఈ తొమ్మిదేండ్లలో ఎందుకు ఈ విమోచన ఉత్సవాలు జరపలేదు.ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు?ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిజంగా చీము, నెత్తురు ఉంటే ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.మజ్లిస్ పార్టీని సంతృప్తి పరిచేందుకే ఇవాళ కేసీఆర్ ఈ ఉత్సవాలను నిర్వహించడం లేదు.కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కలిసి.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను తప్పుదోవ పట్టించేప్రయత్నం చేస్తున్నాయి.ఈ విషయాన్ని గమనించి.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్రం నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్న సందర్భంలో.. తెలంగాణ సమాజాన్ని కోరుతున్నాను.కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలను కోరుతున్నాను.