
ఈ ఏడాదిలో షారుఖ్ ఖాన్ రెండవ మూవీ ‘ జవాన్’ బాక్స్ ఆఫీసు దగ్గర రికార్డులను బ్రేక్ చేసింది. ఈ చిత్రానికి దర్శకుడు అట్లీ. విజయ్ సేతుపతి, నయనతార, దీపికా పడుకొనె, సునీల్ గ్రోవర్, ప్రియమణి, అజ్జీ బాగ్రియా తదితరులు కూడా ఈ మూవీలో కనిపిస్తారు. ఈ చిత్రం యాక్షన్ ప్యాక్డ్ డ్రామా. ఇందులో షారుక్ ఖాన్ మంచి ఎంటర్ టైన్ మెంట్ తో పాటు పవర్ఫుల్ రాజకీయ సందేశాన్ని కూడా ఇచ్చాడు. జవాన్ కథలో యాక్షన్ ఉంది. ఎమోషన్ ఉంది. హీరో విలన్లున్నారు. పాటలు, డ్యాన్సులకు కొదవలేదు. సెంటిమెంట్ తో ఫ్యామిలీ డ్రామాలు పండించడంలో అట్లీది అందెవేసిన చేయి. ఇందులో ఎస్ ఆర్ కెది డబల్ యాక్షన్. ‘పెద్ద’ ఎస్ ఆర్ కె గొప్ప దేశభక్తుడు. ఆర్మీ అధికారి విక్రమ్ రాధోర్ పాత్రలో నటించాడు. ‘చిన్న’ ఎస్ ఆర్ కె అజాద్ పాత్రలో నటించాడు. అతను రాబిన్ హుడ్ టైప్.

అజాద్ సంపన్నులను దోచి ఆ ధనాన్ని పేదలకు పంచుతుంటాడు. ఈ సినిమా తొలి రోజు భారత్ లో 75 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్స్ తో అభిమానుల్లో క్రేజీ ఉత్సాహాన్ని నిపింది. షారుక్ ఫ్యాన్స్ లో మాస్ హిస్టీరియాను రేపింది. అంతర్జాతీయంగా జవాన్ సినిమా 54 కోట్ల కలెక్షన్ వచ్చింది. తన సినిమాకు వచ్చిన అపూర్వ స్పందన చూసిన ‘జవాన్’ ట్విట్టర్ ద్వారా ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాడు కూడా. జవాన్ సినిమాను ఎంజాయ్ చేసిన అభిమానులు ‘జై జవాన్..జై పఠాన్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. గ్రేట్ ఇండియన్ యాక్టర్ అద్భుతమైన పర్ ఫార్మెన్స్ చేశాడని, జవాన్ అద్భుతమైన సినిమా అని ఇంకొందరు ప్రశంసిస్తున్నారు. తమిళ్, తెలుగులో జవాన్ డబ్డ్ వర్షన్ వచ్చింది. ఈ చిత్రంలో దక్షిణాది ఆధిక్యత కనిపిస్తుంది. ఈ సినిమా రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ ప్రెజెంట్ చేస్తే, గౌరీ ఖాన్ ప్రొడ్యూస్ చేసింది. దక్షిణాది దర్శకుడు అట్లీ ఈ సినిమాను డైరక్టు చేశారు.

ఈ సినిమా కోప్రొడ్యూసర్ గౌరవ్ వర్మ. సినిమా గాడ్ అంటూ షారుఖ్ పై కంగానా రౌత్ ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. హైదరాబాదులో జవాన్ కటౌట్ కు అభిమానులు పాలాభిషేకం చేశారు. జవాన్ పాటల ఆల్బమ్ కు శ్రోతల నుంచి అపూర్వమైన స్పందన వచ్చింది. షారుఖ్ ఖాన్ జవాన్ లో విజయ్ సేతుపతి ప్రధాన యాంటొగెనిస్ట్ పాత్ర పోషించాడు. ఈ సినిమా ద్వారా షారుఖ్ మరోసారి ‘బాప్ ఆఫ్ ది ఎంటర్ టైన్ మెంట్’ గా తనను నిరూపించుకున్నాడు. జవాన్ సినిమా ఈ సంవత్సరం బిగ్గెస్ట్ సినిమాగా నిరాజనాలు అందుకుంటోంది. షారుఖ్ అభిమానులు ‘జవాన్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటుంటే, ఎందరో సినిమా ప్రేమికులు షారుఖ్ నటనకు ఫిదా అయ్యామంటున్నారు.