
థియేటర్లలో భోళా శంకర్ చూడడం మిస్ అయిన వాళ్లకు గుడ్ న్యూస్. ఈ నెల 15 నుంచి నెట్ఫ్లిక్స్లో భోళా శంకర్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. దాంతో చాలా మంది థియేటర్లలో సినిమా మిస్ అయ్యారు. అయితే నెట్ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీల్లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది.