
ఆదిపురుష్‌లో రామునిగా దర్శనమిచ్చిన ప్రభాస్ ఇక శివునిగా కనిపించబోతున్నారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఈ మూవీ రానుంది. భక్త కన్నప్ప పేరుతో ఇటీవల మూవీ పూజా కార్యక్రమం పూర్తయ్యింది. ముఖేష్ కుమార్ సింగ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. నుపూర్ సనన్ హీరోయిన్గా ఎంపికైంది. ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో మారిమోగిపోవడంతో మంచు విష్ణు స్పందించక తప్పలేదు. హర హర మహదేవ అంటూ ఆయన ట్విట్టర్లో రెస్పాండ్ అయ్యారు.