
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. తన పర్టనర్ అక్షతా మూర్తితో కలిసి టెంపుల్కు వచ్చారు. బ్రిటన్ ప్రధానిగా పదవీబాధ్యతలు చేపట్టాక రిషి సునాక్ మొదటి సారి భారత్ పర్యటనకు వచ్చారు. జీ20 దేశాల మీటింగ్ కోసం వచ్చిన ఆయన ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అక్షరథామ్ టెంపుల్ సందర్శనలో ఆయన ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేసి ఆయన పర్యటన సజావుగా సాగేలా చూస్తున్నారు.