
మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రెండు రోజులుగా ఉత్కంఠ రేపుతున్న ఎపిసోడ్ ఏసీబీ కోర్టు నిర్ణయంతో మరో మలుపు తిరిగింది. 36 గంటల పాటు ఈ అంశంపై టెన్షన్ నెలకొంది. సుమారు 8 గంటల పాటు సాగిన సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. కాగా14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. కానీ ఇప్పటివరకు ఒక్క కేసులోనూ అరెస్టు కాలేదు.రిమాండ్ కు వెళ్లలేదు. తాజాగా స్కిల్ డెవెలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్టు కావడంతో పాటు రిమాండ్ కు వెళ్లనున్నారు. రాజమండ్రి జైలుకు చంద్రబాబును తరలించనున్నారు. అయితే కోర్టు తీర్పు ఇతర ఫార్మాలిటీల నేపథ్యంలో ఆలస్యం కావడంతో ఆయనను రాత్రంతా సీఐడీ ఆఫీసులో ఉంచి రేపు ఉదయం జైలుకు తరలిస్తారు. 271 కోట్ల స్కామ్ లో చంద్రబాబును అరెస్టు ఏపీ సిఐడి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.