
సీతా దయాకర్ రెడ్డి చేరిక సందర్భంగా గాంధీభవన్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ వివరాలు..
గతంలో నేను ఎమ్మెల్సీగా గెలిచేందుకు దయాకర్ రెడ్డిగారు అండగా నిలబడ్డారు.నా రాజకీయ ఎదుగుదలలో ప్రతీసారి నాకు అండగా నిలబడ్డారు.టీడీపీతో టీఆరెస్ పొత్తు పెట్టుకున్నప్పుడు 2009లో కేసీఆర్ ను ఎంపీగా గెలిపించారు.అప్పుడు కేసీఆర్ గెలుపులో దయాకర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.
పాలమూరు బిడ్డల తరపున నేను ప్రశ్నిస్తున్నా. పాలమూరుకు కేసీఆర్ చేసిందేంటి? పూర్తి కాకుండానే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని గొప్పలు చెబుతున్నారు. 31 పంపుల్లో కేవలం ఒక్క పంపుతోనే ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు. కేసీఆర్ పాలనలో పాలమూరు వలసలు ఆగలేదు.. అభివృద్ధి జరగలేదు.
జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీతక్క నియోజకవర్గం అభివృద్ధి చెందింది. ఇప్పుడున్న దోపిడీ దొంగలకంటే దారుణంగా తయారయ్యారు. కాంట్రాక్టులు, కమీషన్లు తప్ప దేవరకద్ర అభివృద్ధి ఎమ్మెల్యేకు పట్టడంలేదు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతలను పడావుపెట్టారు. పాలమూరు జిల్లాలో 14కు 14 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించాలి.
సీతక్కను రాజకీయంగా అన్ని రకాలుగా పార్టీ ఆదుకుంటుంది. మహబూబ్ నగర్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యత కల్పించింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. కేసీఆర్ ను గద్దె దించడం ఖాయం.
16,17,18న సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, జాతీయ నాయకులు రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నెల 17న తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగే విజయ భేరికి భారీగా తరలిరండి.