
హైదరాబాదులోని జనరల్ పోస్ట్ ఆఫీస్ ముందు గ్రామీణ డాక్ సేవక్స్ నిర్వహిస్తున్న ధర్నాలో ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలలో కష్టించి పనిచేస్తూ నిత్యం ప్రజలతో మమేకమైతున్న గ్రామీణ డాక్ సేవక్‌ల యొక్క ఉద్యోగ భద్రత కల్పించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈఎస్ఐ పీఎఫ్ గ్రాడ్యుటి ఇంక్రిమెంట్ల విషయాలలో ప్రభుత్వంతో చర్చించే విధంగా తన వంతు కృషి చేస్తానని తెలిపిపారు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మూడు లక్షల పైబడిన డాక్ సేవక్‌ల న్యాయమైన డిమాండ్లను రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పారు, ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులతో పాటు ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి విజయ్ కుమార్ యాదవ్, పోస్టల్ యూనియన్ తెలంగాణ సెక్రటరీ (ఐఎన్టియుసి) పి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు