
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే లోకసభలో మహిళా సభ్యుల సంఖ్య 181కి చేరనుంది. ప్రస్తుతం సభ్యుల సంఖ్య 81గా ఉంది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ మహిళా రిజర్వేషన్ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టారు. 128వ రాజ్యంగ సవరణ బిల్లుపై రేపు చర్చ వుంది. పదిహేనేళ్ల పాటు ఈ బిల్లు అమలులో ఉంటుంది. 2027 నుంచి ఈ బిల్లు అమలులోకి వస్తుంది. మహిళా రిజర్వేషన్లను ఖరారు చేసే ముందు నియోజక వర్గాల పునర్విభజన, జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని తర్వాతే రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి. ఎస్సీ, ఎస్టీ కోటాలో కూడా రిజర్వేషన్లు అమలుపరుస్తారు.