
డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు అధికారులు మరో అవకాశం కల్పించారు. ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారి కోసం 7 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. డిగ్రీ కోర్సుల్లో ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారి కోసం 7 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ స్పెషల్ ఫేజ్ ప్రవేశాల షెడ్యూల్ను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి సోమవారం విడుదల చేశారు. ఇంట్రా కాలేజీ స్లైడింగ్ షెడ్యూల్లో మార్పులు చేశారు. విద్యార్థులు ఈ నెల 2 నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని, 5న సీట్లు కేటాయిస్తామని తెలిపారు