
స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డి ప్రెస్ మీట్..
గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తమిళ సై తిరస్కరించడం ఎంతో సాహసోపేతమైన నిర్ణయంఆమె నిర్ణయాన్ని రాష్ట్ర బీజేపీ స్వాగతిస్తూoది. కేసీఆర్ కుటుంబానికి సేవ చేసే వారికి, కేసీఆర్ కుటుంబం కాళ్ళ దగ్గర పడి ఉండే వారికి గవర్నర్ కోటాలో సిఫారసు చేస్తే…. అలాంటి అభ్యర్థిత్వాలను తిరస్కరించకుండా గవర్నర్ ఎలా ఉంటారు. గవర్నర్ కోటాలో పార్టీలు ఫిరాయించే వారి అభ్యర్థిత్వాలను ఎలా సిఫారసు చేస్తారు.గవర్నర్ కోటాలో కవులు, కళాకారులు, మేధావులు, క్రీడాకారులను ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు ఎంపిక చేయాలి.కానీ దానికి భిన్నంగా ఫక్తు రాజకీయాలు చేసే వారిని ఎంపిక చేయడం సరైంది కాదుఉదాహరణకు…రాష్ట్రపతి కోటాలో ప్రధాని మోడీ సిఫారసు చేసిన వారిలో రచయిత విజయేంద్ర ప్రసాద్, పరుగుల రాణి పీటీ ఉషా ఉన్నారు. వారికి, రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా…అలాగే గవర్నర్ కోటాలో కూడా అలాంటి రంగాలకు చెందిన వారిని ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు నామినేట్ చేయాలి.కానీ అందుకు భిన్నంగా నామినేట్ చేస్తానంటే గవర్నర్ ఎందుకు తిరస్కరించరుగవర్నర్ కు… బీజేపీకి ఎలాంటి సంబంధం ఉండదు.ఒకసారి గవర్నర్ గా నియమించబడ్డ తర్వాత పార్టీకి ఏం సంబంధం ఉంటుంది.కేసీఆర్ తప్పుల్ని ఎత్తి చూపితే, ప్రశ్నిస్తే…గవర్నర్ కు బీజేపీతో సంబంధం ఉందని విమర్శిస్తారా?