
మహిళా బిల్లు సాధించారని ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్ సిటీలో బీఆర్ఎస్ శ్రేణుల స్వాగతం
ర్యాలీ ముగిసిన పాత కలెక్టరేట్ గ్రౌండ్ ఆవరణలో కవిత కామెంట్స్..
తెలంగాణ గడ్డపై వచ్చేముందు ప్రధాని మోడీ హామీల అమలుకు డిమాండ్
కాలేశ్వరానికి జాతీయ హోదా, నిజాంబాద్ లో పసుపు బోర్డు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, విభజన చట్టంలో హామీలపై నిర్ణయాన్ని ప్రకటించాలి
ప్రస్తుత మహిళా బిల్లు పోస్ట్ డేటెడ్ చెక్కు లాంటిది
మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలి
కాంగ్రెస్‌కు అధికార యావ తప్ప మరో ధ్యాస లేదు
అధికారంలో ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ ఎందుకు చేయలే… తెలివి ఉంటే ఎప్పుడో బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు న్యాయం జరిగేది
బిఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం.. ఆపడం ఎవరి వల్ల కాదు
మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలి
మహిళా రిజర్వేషన్ విషయంలో నిద్రపోయిన పార్టీలను జాగృతి ధర్నాతో లేపాం
మధ్యప్రదేశ్‌కు రూ.42 వేలకోట్ల విలువ ప్రాజెక్టులను ప్రకటించిన ప్రధాని మోడీ తెలంగాణను విస్మరిస్తున్నారు
తెలంగాణ రాష్ట్రంలో పవర్ లోకి రావాలని కాంగ్రెస్ కలలు కంటుంది..వారిని చూసి ఏడవలో నవ్వాలో అర్థం అవుతలే
ప్రజల ఆశీర్వాదంతో 10 ఏళ్ల నుంచి టిఆర్ఎస్ పార్టీ పాలన నడుస్తుంది. ఒక మత కల్లోలం జరగలేదు. రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు వస్తున్నాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి
రాష్ట్రంలో అభివృద్ధితోపాటు ఆత్మగౌరవంతో ప్రజలు జీవించాలనేది బిఆర్ఎస్ ఆలోచన
బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒకటే