
హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత. ఆయన వయస్సు 98 సంవత్సరాలు. స్వామినాథన్ ని భారతీయ వ్యవసాయ పితామహునిగా పిలుస్తారు. జన్యు శాస్త్ర నిపుణులైన స్వామినాథన్ ఉత్తమ వారి వంగడాలు సృష్టించారు.
దేశం ఆహార సంక్షోభం ఎదుర్కొన్న కాలంలో స్వామినాథన్ పరిశోధనలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఆయన కనుగొన్న నూతన వంగడాలు, ఆధునిక వ్యవసాయ విధానాలు దేశంలో ఆహార ఉత్పత్తి పెరిగేందుకు కారణమయ్యాయి. 1960ల ప్రాంతంలో ఆయన వ్యవసాయ రంగంలో తీవ్రమైన పరిశోధనలు చేశారు. ఫలితంగానే వ్యవసాయ రంగంలో దేశం పురోభివృద్ధి సాధించి ఆహార కొరతను నివారించగలిగింది. ఆయన శ్రమకు ఫలితంగా పంజాబ్, హర్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటి విస్తారమైన ఉత్పత్తిని చూసి నాటి పరిస్థితికి హరిత విప్లవంగా పేరు పెట్టారు. స్వామిథన్ కృషి ఫలితంగానే ఈ పరిస్థితి తలెత్తినందున ఆయనను ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్గా వ్యవహరిస్తున్నారు.
స్వామినాథన్ పూర్తి పేరు మొన్కుంబు సాంబశివన్ స్వామినాథన్, 1925 ఆగస్టు 7న ఆయన కుంబకోణంలో జన్మించారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో తన అధ్యయనం, పరిశోధనలు కొనసాగించారు. ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించి దానికి ఛైర్మన్గా ఉన్నారు. స్వామినాథన్ రాజ్యసభ సభ్యునిగా కూడా బాధ్యతలు నెరవేర్చారు.