
11లక్షల 11వేల 16 రూపాయలకు శేరి పర్వత రెడ్డి కి దక్కిన లడ్డు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలంలోని మధురపురం గ్రామం రెడ్డి సేవా సమితి వినాయక లడ్డు 11 లక్షలకు పైగా వేలంపాటలో దక్కించుకున్నారు. అదే గ్రామానికి చెందిన శేరి పర్వత రెడ్డి ఈ వినాయక లడ్డూను దక్కించుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా లక్షల పైనే ఈ లడ్డు ధర పలుకుతుండడం విశేషం. ఈ ఈ ఎడాది కూడా 11 లక్షల రూపాయల లడ్డూను వేలం పాటలో దక్కించుకోవడం మరో సరికొత్త రికార్డును సొంతం చేసుకోండి. షాద్ నగర్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున లడ్డు కైవసం చేసుకున్న దాఖలాలు ఎక్కడ లేవు. ఇప్పుడు ఇది మూడో సంవత్సరం కావడం విశేషం. వరుసగా పది లక్షలకు పైగా లడ్డు ధర పలుకుతుంది.