
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గణేష్ లడ్డు రికార్డు ధర పలికింది. కీర్తి రిచ్మండ్ విల్లాలో ఏర్పాటు చేసిన గణేష్ లడ్డు వేలం పాటలో 1.26 కోట్లకు పలికింది. గణేష్ లడ్డు వేలంలో ఇప్పటికీ ఇదే అల్ టైమ్ హై కావడం గమనార్హం. లడ్డును అర్వి దియ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు దక్కించుకున్నారు.
బాలాపూర్ లడ్డూను 27 లక్షలకు తుర్కాయంజాల్ కు చెందిన దాసరి దయానంద్ రెడ్డి స్వంతం చేసుకున్నారు.
గచ్చిబౌలిలోని మై భూజాలోని వేలం పాటలో గణేష్ లడ్డు 25.50 లక్షల రూపాయలు పలికింది. ఈ వేలం పాటను బుధవారం నిర్వహించారు. ఉన్నతి ఇన్ఫ్రా ఎండీ ఈదులకంటి చిరంజీవి వేలంపాటలో లడ్డు దక్కించుకున్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలంలోని మధురపురం గ్రామం రెడ్డి సేవా సమితి వినాయక లడ్డు 11 లక్షలకు పైగా వేలంపాటలో దక్కించుకున్నారు. అదే గ్రామానికి చెందిన శేరి పర్వత రెడ్డి ఈ వినాయక లడ్డూను దక్కించుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.