
పెరిక (పురగిరి క్షత్రియ) కులస్తులకు ‘కుల కార్పొరేషన్’ ఏర్పాటు చేయాలి
వీరయ్య ముత్తినేనీ రాష్ట్ర చైర్మన్, పెరికల రాజకీయ ఐక్యత, పెరిక కుల కార్పొరేషన్ సాధన సమితి
ఈ రోజు కరీం నగర్ జిల్లా కలెక్టరేట్ ముందు పెరిక కుల రాజకీయ ఐక్యత, కుల కార్పొరేషన్ సాధన సమితి వైస్ చైర్మన్ ఏర్రంశెట్టి మునిందర్ ఆధ్వర్యంలో పెరిక కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని రాష్ట్ర చైర్మన్ ముత్తినేనీ వీరయ్య మన జాతి పిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా గాంధీజీ స్ఫూర్తితో దీక్ష చేశారు.
ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ రామాయణ, మహాభారత కాలాల నుండి పెరిక కుల చరిత్రకి చారిత్రిక ఆధారాలు ఉన్నాయని అన్నారు. మొదట రాజ్యాలు పాలించారు అని, తర్వాత ఎంతో నమ్మకంతో ధన ధాన్యలని, వజ్ర వైడుర్యాలని సైతం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించే వారన్నారు. ఆ సమయంలో జనప నారతో గోనె సంచులు తయారు చేశారు అని, ఆ తర్వాత విత్తనాభివృద్ది చేశారన్నారు. ఇప్పుడు వ్యవసాయం,వ్యాపార రంగాలలో ఉండటం వల్ల ప్రత్యేకంగా వృత్తి లేకుండా పోయింది అని చెప్పారు.
ప్రత్యేకంగా వృత్తి లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ పలాలు పొందలేక పోతున్నారన్నారు. ఇది గమనించిన నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పెరిక కాలానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇక్కడ కూడా ప్రభుత్వం వెంటనే కార్పోరేషన్ ఏర్పాటు చేసి కులాభివృద్దికి కనీసం 500 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50 నియోజక వర్గాల లో గెలుపు ఓటములు నిర్ణయించగల శక్తి పెరిక కుల ఓట్లకి ఉందన్నారు. పూర్వ అన్ని రాజకీయ పార్టీలు పెరిక కులస్తులకు రాజకీయ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమం లో పెఱిక కుల ఐక్యత వైస్ చైర్మన్ ఎర్రంశెట్టి మునిందర్, కరీంనగర్ పెఱిక సంఘం మాజీ అధ్యక్షులు కర్రె సురేందర్, అధ్యక్షులు చిరంచెట్టి ప్రభాకర్, నగర అధ్యక్షులు శ్రీరామ్ భద్రయ్య, మాదని వీరశేఖర్,దొమ్మటి గంగాధర్, దాసరి అశోక్, కాసార్ల కాలములో మా కులానికి యుద్దాలు చేసిన గణ చరిత్ర ఉందని ఇప్పుడు పెరిక కులానికి కార్పొరేషన్ సాధన కొరకు అవసరమైతే గెరిల్లా పోరాటము చేస్తామని అన్నారు.