
మోదీతో చేరేందుకు మాకేం పిచ్చికుక్క కరవలేదు..మోదీ చెప్పే అబద్దాలు చిన్నపిల్లలు కూడా నమ్మరు. మేం గుజరాత్ గులామ్లం కాదు.. ఢిల్లీకి బానిసలం కాదు..మోదీ అబద్దాలకు, పెడబొబ్బలకు ఇక్కడ ఎవరూ భయపడరు
మోదీ ఎంత గొంతు చించుకున్నా అబద్దాలు నిజం కావు.. మోదీ దగుల్బాజీ మాటలు దేశంలో ఎవరూ నమ్మరుమోదీ ఎప్పుడో ఒకసారి రాష్ట్రానికి టూరిస్ట్లా వచ్చి అడ్డమైన చెత్తా వాగి పోతారు
నేను సీఎం కావాలంటే మోదీ పర్మిషన్ ఎందుకు? తెలంగాణ ఎమ్మెల్యేలు.. ప్రజలు అనుకుంటే నేను సీఎం అవుతా..ఈ మాత్రం సోయ కూడా ప్రధానికి లేదా? మోదీ నుంచి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం కేసీఆర్ సర్కార్కు లేదు