తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు, పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలనను అందిస్తాం.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతి రోజూ “ప్రజా దర్బార్” నిర్వహిస్తాం.
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ అమరవీరుల తల్లి/తండ్రి/భార్య కు రూ. 25000 ల నెలవారీ గౌరవ పెన్షన్‌ను, మరియు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం
తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేసి, వారికి 250 గజాల ఇళ్ల స్థలాలను కేటాయిస్తాం.
రైతులకు రూ. 2 లక్షల పంట ఋణ మాఫీ చేస్తాం.
వడ్డీలేని పంట రుణాలను రూ.3 లక్షల వరకు అందచేస్తాం.
వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత కరెంట్.
అన్ని ప్రధాన పంటలకు సమగ్ర భీమా పధకాన్ని అందిస్తాం. 8ఎ. ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మా సిటీలను రద్దు చేస్తాం.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి మరియు అవకతవకలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తాం.
మెగా డీఎస్సీ ని ప్రకటిస్తూ ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను 6 నెలల లోనే భర్తీ చేస్తాం.
వార్షిక జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి పారదర్శకంగా నిర్ణీత కాలంలో 2 లక్షల ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాం.
ప్రతి విద్యార్థి, విద్యార్దినులకు ఫ్రీ (ఇంటర్నెట్) వైఫై సౌకర్యం కల్పిస్తాం.
విద్యారంగానికి బడ్జెట్ లో ప్రస్తుత వాటా 6% నుండి 15% వరకు పెంచుతాం.
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు నెలవారీ వేతనాన్ని రూ.10,000 లకు పెంచుతాం.
మూతబడిన దాదాపు 6 వేల పాఠశాలలను తిరిగి మెరుగైన సదుపాయాలతో పునఃప్రారంభిస్తాం.
బాసర ట్రిపుల్ ఐటి (IIIT) తరహాలో మరో 4 ట్రిపుల్ ఐటి లను ఏర్పాటు చేస్తాం
ఆరోగ్యశ్రీ పధకం పరిమితి 10 లక్షలకు పెంచి మరియు ఈ పథకం మోకాలు సర్జరీకి కూడా వర్తింప చేస్తాం. 18. ధరణి పోర్టల్ స్థానంలో “భూమాత” పోర్టల్‌ను ప్రవేశ పెట్టి భూహక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తాం.
“ల్యాండ్ కమీషన్” ఏర్పాటు చేసి, అన్ని భూహక్కుల సమస్యలను పరిష్కరిస్తాం.
భూ సంస్కరణల ద్వారా పేదలకు పంపిణీ చేసిన దాదాపు 25 లక్షల ఎకరాలపై పూర్తి స్థాయి భూహక్కులను లబ్దిదారులకు కల్పిస్తాం.
73, 74 వ రాజ్యాంగ సవరణల ప్రకారము, మూడంచెల స్థానిక సంస్థలను బలోపేతం చేసి, విధులు, నిధులు మరియు నిర్వహణ భాద్యతలను అప్పగిస్తాం.
గ్రామ పంచాయితీ వార్డు మెంబర్లకు గౌరవ వేతనం నెలకు రూ. 1500 ఇస్తాం. అదే విధంగా మాజీ సర్పంచ్, ఎంపీటీసీ మరియు జడ్ పీటీసీ సభ్యులకు గౌరవ పెన్షన్ అందచేస్తాం.
ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ పెండిరగ్లో వున్న మూడు DA లను తక్షణం చెల్లిస్తాం.
ప్రస్తుతం ఉన్న CPS విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ (OPC) విదానాన్ని అమలు చేస్తాం.
ప్రభుత్వ ఉద్యోగులకు, RTC సిబ్బందికి కొత్త PRC ప్రకటించి 6 నెలలలోపు సిఫారసులను అమలు చేస్తాం.
ఆర్టీసీ సిబ్బందికి రెండు పిఆర్సి బకాయిలను వెంటనే చెల్లిస్తాం.
ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ. 12000 లు ఆర్థిక సహాయం అందచేస్తాం.
పెండింగ్ లో ఉన్న అన్ని ట్రాఫిక్ చలానాలు 50% శాతం రాయితీతో (one time Settlement) $ 0.
బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తాం.
ఎస్సీ వర్గీకరణ అనంతరం మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తాం.
బీసీల “కుల గణన” చేసి, జనాబా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తాం.
సంచార జాతులకు విద్య, ఉద్యోగ అవకాశాలతో 5% రిజర్వేషన్ కల్పిస్తాం.
ప్రతి జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద ‘బిసి భవన్’ ఏర్పాటు చేస్తాం.
జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతాం.
అన్ని వెనుకబడిన కులాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తగు నిధులను కేటాయిస్తాం.
వెనుకబడిన తరగతులకు (బీసి) సబ్ ప్లాన్ అమలు చేస్తాం.
ఈబీసీ ల కొరకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం.
సరిపడా నిధులతో మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తాం.
నిరుపేద హిందూ మరియు మైనారిటీ ఆడపడుచులకు వివాహ సమయంలో ఇచ్చే రూ. 1,00,000 తో పాటూ ఇందిరమ్మ కానుకగా 10 గ్రాముల బంగారం ఇస్తాం.
సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల విధానాన్ని పునః పరిశీలించి సరళీకృతం చేస్తాం.
సింగరేణి సంస్థ ప్రయివేటీకరణకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించదు.
బీడీ కార్మికులకు జీవిత భీమా, ఈఎస్ఐ పరిధిలోకి తెస్తాం.
ప్రమాదవశాత్తు చనిపోయే గీత కార్మికులకు రూ. 10 లక్షల వరకు, ఎక్స్రేషియా పెంచుతాం.
యాదవ, కుర్మలకు దళారీలు లేకుండా నేరుగా రూ. 2 లక్షల గొర్రెల పెంపకం కోసం అందచేస్తాం.
రాజస్థాన్ తరహాలో అసంఘిటిత కార్మికులకు, ఉదా: భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, కాబ్ డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో (Gig & plat form) వారికి సామాజిక భద్రత కల్పిస్తాం.
స్వయం సహాయక బృందాలకు పావలా వడ్డీతో రుణ పరిమితిని రూ. 10 లక్షల వరకు పెంచుతాం.
పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సహాయంతో కూడిన “బంగారు తల్లి” పధకాన్ని పునరుద్ధరిస్తాం.
18 సంవత్సరాలు పైబడి, చదువుకొనే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా అందజేస్తాం.
అన్ని జిల్లా కేంద్రాలలో “ ఓల్డ్ ఏజ్ హెూమ్స్” ఏర్పాటు చేస్తాం.
సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో వున్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తాం.
మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు 5 లక్షల నగదు ఇస్తాం.
రాష్ట్రంలో వున్న ప్రజా పంపిణీ రేషన్ డీలర్స్కు రూ. 5 వేలు గౌరవ వేతనం ఇస్తాం.
ఇకపై తెల్ల రేషన్ కార్డులపై ఇకనుండి సన్న బియ్యం సరఫరా చేస్తాం.
గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం.
మరణించిన గల్ఫ్ కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తాం.
దివ్యాంగుల నెలవారీ పెన్షన్ ఇకనుండి రూ.6000 లకు పెంచుతాం.
ప్రతి జిల్లాకు రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తాం.
హెూమ్ గార్డుల వేతన సవరణలతో పాటూ వారి అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం.
నిరుద్యోగులకు ఉపాధి కల్పనగా ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చి, చిన్న మరియు మధ్య తరగతి పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు అందచేస్తాం
అంగన్వాడీ టీచర్లకు నెలసరి వేతనం 18000 లకు పెంచుతూ ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రతను కల్పిస్తాం.