
ఏవోసీ సెంటర్(ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్ సెంటర్)లో శిక్షణ పొందిన మొదటి బ్యాచ్ అగ్నివీర్ల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. శనివారం జరిగిన కార్యక్రమంలో ఏవోసీ కమాండెంట్ బ్రిగెడియర్ అజీత్ అశోక్ దేశ్పాండే విజయవంతంగా శిక్షణ ముగించుకున్న అగ్నివీర్లకు పతకాలు బహుకరించారు. 232 అగ్నివీర్లకు 13 మార్చి, 2023లో మిలటరీ శిక్షణ ప్రారంభమైంది. 24 వారాల కఠిన శిక్షణ అనంతరం ట్రైనింగ్ ముగిసింది. డిఫెన్స్ మినిస్ట్రీ 2022 జున్ 14న దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీమ్ కింద ఈ శిక్షణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏవోసీలోని పరేడ్ గ్రౌడ్లో పాసింగ్ ఔట్ జరిగింది.