గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. అభ్యర్థుల పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. నవంబర్‌లో పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 29, 30 తేదీల్లో పరీక్ష వాయిదా పడాల్సి ఉంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శనివారం రాత్రి సీఎస్ శాంతి కుమారి, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్‌తో చర్చించారు. అనంతరం సీఎస్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి కేటీఆర్ ఈ ప్రకటనకు కొంచెం ముందే పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ట్వీట్ చేశారు.