
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హచ్చు తండ గ్రామ పంచాయతీ పరిధిలోని బొత్తల తండాకు చెందిన గుగులోత్ రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడాడు. 2020 నుండి ఎన్ఐటీలో ఫ్రెండ్స్‌తో ఉంటూ ఏఈఈ, గ్రూప్ 1, 2, 4 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఏఈఈ పోటీ పరీక్షల్లో ఓపెన్ కేటగిరిలో ఉద్యోగం వస్తదని ఆశించాడు. కానీ పేపర్ లీక్ కావడంతో మళ్లీ పరీక్ష రాశాడు. కానీ ఉద్యోగం వస్తుందో, రాదోననే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. కొడుకు మరణానికి తట్టుకోలేక రాజ్‌కుమార్ తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించారు. రాష్ట్ర ప్రభుత్వమే తన కొడుకు మరణానికి కారణమని ఆరోపించారు. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలన్నారు.