
నీట్ ఎగ్జామ్‌లో క్వాలిఫై కాలేదని రెండు రోజుల క్రితం కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అది తట్టుకోలేక తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. జగదీశ్వరన్ గత రెండేళ్లుగా నీట్‌కు ప్రిపేర్ అవుడుతున్నాడు. అయినా అందులో రాణించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగదీశ్వరన్ అంత్యక్రియల రోజునే విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నిఇలాంటి పరీక్షలపై తంద్రడి సెల్వశేఖర్ మండిపడ్డారు. ఇలాంటి పరీక్షా విధానం నశించాలని ఆశించారు. జగదీశ్వరన్ మరణం గురించి తెలుసుకున్న తమిళనాడు సీఎం స్టాలిన్ సంతాపం ప్రకటించారు. పిల్లలెవరు ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు. పరీక్ష కోసం మోయలేని భారాన్ని నెత్తికెత్తుకోవద్దనీ, జీవితంలో బతికేందుకు అనేక దారులున్నాయని చెప్పారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. నీట్‌ను రాష్ట్రంలో బ్యాన్ చేస్తూ ప్రభుత్వం రూపొందించిన బిల్లును గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆమోదించకుండా ఉన్న విషయం తెలిసిందే. జగదీశ్వరన్, ఆయన తండ్రి సెల్వ శేఖర్ మరణం తర్వాత గవర్నర్‌పై జనంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.